సరిగా రెండేళ్ల క్రితం.. ఇదే రోజు అనగా.. జూన్ 14, 2020.. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెందారు. దేశవ్యాప్తంగా సుశాంత్ మృతి తీవ్ర కలకలం రేపింది. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సుశాంత్.. ఒక్కో మెట్టు ఎదుగుతూ.. హీరో స్థాయికి చేరాడు. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. ఓ వైపు అనుకున్న రంగంలో విజయం.. మరో వైపు నచ్చిన నెచ్చలితో సంతోషకరమైన జీవితం గడుపుతున్న సుశాంత్.. ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలచి వేసింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ బెదిరింపులు, బంధుప్రీతి, అవకాశాలు రావని డిప్రెషన్‌కు గురవ్వడం.. డ్రగ్స్ వినియోగం తదితర కారణాల వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే వాదనలు బలంగా వినిపించాయి. ఇప్పటికి కూడా సుశాంత్ మృతి ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.
ఇక సుశాంత్ మృతి తర్వాత.. ప్రతి ఒక్కరు తన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని దారుణంగా విమర్శించారు. ఆమె వల్లనే సుశాంత్ పరిస్థితి ఇలా తయారయ్యిందని.. ఆమె సుశాంత్ మీద ఏవో మందులు ప్రయోగించి.. డిప్రెషన్‌కు గురై.. ఆత్మహత్య చేసుకునే వరకు పరిస్థితిని తీసుకువచ్చిందని ఆరోపించారు. సుశాంత్ పేరు చెప్పి ఆమె డ్రగ్స్ వాడేదని విమర్శించారు. సుశాంత్ కటుఉంబ సభ్యులు కూడా రియా చక్రవర్తిపై దారుణంగా విమర్శలు చేశారు. ఇక డ్రగ్స్ వినియోగం కారణంగా రియా చక్రవర్తి జైలుకు కూడా వెళ్లింది.
ఇది కూడా చదవండి: Karnataka CM: చార్లీ సినిమా చూసి ఏడ్చేసిన కర్ణాటక సీఎం.. వీడియో వైరల్!
ఈ క్రమంలో నేడు సుశాంత్ సింగ్ రెండవ వర్థంతి సందర్భంగా రియా చక్రవర్తి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి తెగ వైరలవుతోంది. దీనిలో రియా.. సుశాంత్‌తో కలిసి ఎంజాయ్ చేస్తూ దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేసింది. వాటితో పాటు.. ప్రతి రోజు నిన్ను మిస్ అవుతన్నాను అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరలవుతోంది. ఇది చూసిన సుశాంత్ తనను తల్చుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. రియా చక్రవర్తి పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Nayanthara: పెళ్లికి రాని నయనతార తల్లి! పెళ్ళైన 5 రోజులకే పుట్టింటికి నయనతార!