ముహుర్తాలు మంచిగా ఉన్నాయో ఏమో కానీ.. ఈ మధ్య చాలామంది నటీనటులు పెళ్లి చేసుకుంటున్నారు. బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పేసి, నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేస్తున్నారు. కొన్నిరోజుల ముందు హీరో నాగశౌర్య, హీరోయిన్ మంజిమా మోహన్ లాంటి వాళ్లు.. వేర్వేరుగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేశారు. ఇక స్టార్సే కాకుండా చిన్నచిన్న యాక్టర్స్ కూడా మ్యారేజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇక షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్న ఓ భామ… ఇప్పుడు ప్రముఖ సింగర్ తో కొత్త రిలేషన్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మౌనిక రెడ్డి. షణ్ముక్ జస్వంత్ ‘సూర్య’ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా చేసిన ఈమె.. చాలా ఫేమ్ తెచ్చుకుంది. అలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’లో కానిస్టేబుల్ పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక రీసెంట్ గా వచ్చిన ‘ఓరి దేవుడా!’ సినిమాలోనూ ఓ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు సందీప్ అనే సింగర్ ని పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టాలోనూ షేర్ చేసింది.
ఇకపోతే తొలుత ఫ్రెండ్స్ గా పరిచయమైన వీరిద్దరూ.. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అలా అతడు సింగర్ కాగా, ఈమె నటి. డిసెంబరు 17,18 తేదీల్లో గోవాల్లో.. వీళ్ల పెళ్లి జరగనుంది. ఇక గత కొన్నాళ్లలో సందీప్ తో తీసుకున్న ఫొటోలు, వీడియోలను మౌనిక.. ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ వచ్చింది. కొన్నేళ్ల నుంచి రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ.. కలిసి టూర్స్ కి కూడా వెళ్లారు. అయితే ఇప్పుడు పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించడంతో అందరికీ విషయం అర్థమైపోయింది. మరి పెళ్లి తర్వాత కూడా మౌనిక నటిగా కంటిన్యూ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.