Surya: సినిమాల్లోనూ.. నిజ జీవితంలోనూ స్పూర్తిగా నిలిచే వ్యక్తిత్వం గల అతి కొంతమంది హీరోల్లో సూర్య మొదటి వరుసలో ఉంటారు. తాను చేసే ప్రతీ సినిమాలో సమాజానికి పనికి వచ్చే ఏదో ఒక విషయాన్ని చూపిస్తూ ఉంటారు. కమర్షియల్ హంగులతో పాటు జనానికి పనికి వచ్చే వాటిని సినిమాలో ఉండేలా చూసుకుంటారు. ప్రతీ పాత్ర కోసం ఎంతో కష్ట పడతారు. తన శరీరాన్ని పాత్రకు తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటారు. ‘మనం చేసే పనిలో 100శాతం ఫలితాన్ని ఆశిస్తే.. అందుకు 1000శాతం కష్టపడాలి’ అంటారు సూర్య.
అదే విధంగా కష్టపడుతున్నారు కూడా.. ఇందుకు తాజా ఉదాహరణ ‘వాడివాసల్’ సినిమా. ఈ సినిమా ‘జల్లి కట్టు’పై తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో సూర్య నిజమైన పోటీ ఎద్దులతో జల్లికట్టు నేర్చుకుంటున్నారు. ప్రమాదం అని తెలిసినా దానికి వెనకాడటం లేదు. తాజాగా, ‘వాడివాసల్’ షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో విడుదలైంది. ఆ వీడియోలో జల్లికట్టు చేసే వారితో సూర్య శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ సందర్భంగా ఓ ఎద్దు ఆయన మీదకు దూసుకెళ్లింది.
సూర్య ఎంతటి ప్రమాదానికి ఎదురెలుతున్నారనేది ఆ వీడియోను చూస్తే తెలుస్తుంది. కాగా, హీరో సూర్య ‘సూరరై పోట్రు’ సినిమాలో తన నటనతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. సూర్యతో పాటు చిత్రంలోని హీరోయిన్ అపర్ణా బాలమురళికి కూడా అవార్డు వచ్చింది. సూరరై పోట్రు సినిమా మొత్తం ఐదు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. సూర్యకు, చిత్ర బృందానికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి, సూర్య ‘వాడివాసల్’ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Srinu Vaitla: విడాకుల వ్యవహారం.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన శ్రీను వైట్ల