Suriya’s Daughter: స్టార్ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను అదేస్థాయి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న సూర్య.. 2006లో హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సూర్యతో జ్యోతిక కాక కాక, మాయావి లాంటి సినిమాలలో నటించింది. ఇక వీరిద్దరూ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ నిర్మాతలుగా కూడా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు.
సూర్య, జ్యోతిక జంటకు కూతురు దియా, కొడుకు దేవ్ ఉన్నారు. ఓవైపు భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూనే పిల్లల ఆలనాపాలనా చూసుకుంటోంది జ్యోతిక. వీరికి పిల్లలంటే ఎంతో ప్రేమ. ముఖ్యంగా కూతురు దియాతో సూర్యకు ఉన్న అనుభందం మాటల్లో చెప్పలేనిది. కాస్త సమయం దొరికినా సూర్య కూతురు, కొడుకుతో కలిసి చిన్నపిల్లాడు అయిపోతాడు.
ఇక సూర్య కూతురు దియా చెన్నైలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ ఏడాది 10వ తరగతి పూర్తి చేసింది. తాజాగా దియా టెన్త్ పరీక్షా ఫలితాలు కూడా బయటికి వచ్చాయి. చిన్నతనం నుండే చదువుల్లో చాలా షార్ప్ దియా. మొదటి నుంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన దియా.. టెన్త్ లో అద్భుతమైన మార్కులు సాధించింది. దీంతో దియా మార్కులు చూసిన వారంతా సర్ప్రైజ్ అవుతున్నారు.
అన్ని సబ్జెక్టుల్లో దియా టాప్ లెవెల్ మార్కులు సాధించడం విశేషం. సబ్జెక్టు ప్రకారం చూసుకుంటే.. మ్యాథ్స్ లో వందకు వంద, ఇంగ్లీష్ లో 99, సైన్స్‌లో 98, తమిళ్, సోషల్ లో 95 మార్కులు రావడం విశేషం. మ్యాథమెటిక్స్ అంటేనే సగం స్టూడెంట్స్ ఆమడ దూరం పరిగెడతారు. అలాంటిది సూర్య కూతురి మార్కులు చూసేసరికి.. ఆమె ఏ స్థాయి ఇంటెలిజెంటో అర్థం చేసుకుంటున్నారు.
ఇక కూతురు సాధించిన బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ కు సూర్య దంపతులు పొంగిపోతున్నారు. అంతేగాక కుటుంబం, బంధువులు అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య, జ్యోతికల అభిమానులు సైతం దియాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం దియా టెన్త్ మార్కుల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దియా మార్కులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Diya – Daughter of Jothika & Suriya, scored 487/500 in her 10th results.
Tamil – 95. Social Science – 95. Science – 98. English – 99. Maths – 100 –
Source: Polimer News.#10thResult2022#10thresults2022 #Diya #Jyothi#Suriya #jothika https://t.co/hE5t7zBPxJ
— 𝚜𝚊𝚝𝚑𝚒𝚢𝚊❤️என்றும் சூர்யா ரசிகன்🔥 (@Sathiya1522) June 21, 2022