సినీ ఇండస్ట్రీలో హీరో సూర్య గురించి తెలియని వారు ఉండరు.. తన సహజ నటనతో కోట్ల మంది అభిమానం సంపాదించాడు సూర్య. తమిళ ఇండస్ట్రీలోనే కాదు సూర్యకు తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ మంచి మార్కెట్ ఉంది. సూర్య తన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఏక కాలంలో రిలీజ్ చేస్తుంటారు. తాజాగా హీరో సూర్యకు అరుదైన గౌరవం దక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది ‘జై భీమ్’. ఈ చిత్రానికి పలు అవార్డులు కూడా దక్కాయి. కరోనా కారణంగా సూర్య నటించిన పలు చిత్రాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. హీరో సూర్యకి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. దక్షిణాది ఇండస్ట్రీ నుంచి ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తొలి నటుడు సూర్య. ఈ ఆహ్వానం బాలీవుడ్ నుంచి ప్రముఖ నటి కాజోల్ కి కూడా వచ్చింది. అకాడమీ యూ ట్యూబ్ ఛానెల్‌లో ఇలా ఓ తమిళ సినిమా వీడియోను పోస్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం.
ప్రముఖ దర్శకులు జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించడమే కాదు.. భార్య జ్యోతికతో కలిసి సినిమాను నిర్మించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లాక్ డౌన్ నేపథ్యంలో ‘జై భీమ్’ చిత్రాన్ని ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అణగారిన వర్గాల కోసం న్యాయ పోరాటం చేసిన లాయర్ చంద్రు జీవితాన్ని ఆధారంగా చేసుకుని జై భీమ్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Proud to be his fan❤️❤️
The first South indian actor to be invited to become the membar of the @TheAcademy Prestigious #Oscars2022
Proud moment for South cinema:#Suriya Pride of Indian cinema🇮🇳#SooraraiPottru #JaiBhim #VaadiVaasal #Suriya41 #RolexSir#Vikram #Vikram25Days pic.twitter.com/awC5Ost69m
— Amaresh Hugar (@AmareshHugarrr) June 29, 2022