ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రేమ, పెళ్లి పకార్లపై ఆమె తండ్రి సురేష్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన పుకార్లపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రేమలో పడిందంటూ గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వ్యక్తితో ఉన్న ఫొటోలు షేర్ చేశారు. ఆ ఫొటోలు చాలా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రేమలో పడిందన్న పుకార్లు పుట్టుకొచ్చాయి. పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. ప్రేమలో ఉన్నారని, అందుకే ఒకే రకం బట్టలు వేసుకుని తిరుగుతున్నారని అన్ని మీడియా సంస్థలు వార్తలు రాసేశాయి. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని కీర్తి సురేష్ స్పష్టం చేశారు.
మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చి చెప్పారు. తాజాగా, ఈ పుకార్లపై కీర్తి సురేష్ తండ్రి సురేష్ కూడా స్పందించారు. ఈ మేరకు కేరళ బీజీపీ నాయకురాలు శోభ సురేంద్రన్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో ఈ విధంగా చెప్పుకొచ్చారు. ‘‘నా కూతురు కీర్తి ఓ అబ్బాయితో లవ్‌లో ఉందని.. త్వరలో అతడ్ని పెళ్లి చేసుకోబోతోందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్. నా ఆ అబ్బాయి తెలుసు. అతడి పేరు ఫర్హాన్.
అతడు మా కుటుంబ స్నేహితుడు. ఫర్హాన్ పుట్టిన రోజున కీర్తి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వాటిని చూసి మీడియా తప్పుడు వార్తలు రాసింది. కీర్తి పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు ముందే చెప్తాము. తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు. అలాంటి వార్తల కారణంగా మా కుటుంబంలో మనఃశాంతి కరువైంది’’అని పేర్కొన్నారు. మరి, కీర్తి సురేష్ లవ్ ఎఫైర్ పుకార్లపై తండ్రి సురేష్ స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.