టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు సుప్రీత గురించి కొన్ని వార్తలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే ఫ్యాన్స్ కి పెళ్లి వార్త చెప్పబోతుందని అంటున్నారు నెటిజన్స్. అందుకు కారణం కూడా లేకపోలేదు.
సెలబ్రిటీల లవ్ మ్యాటర్స్ ఎప్పుడూ ఆడియెన్స్ కి ఆసక్తికరంగానే ఉంటాయి. పెళ్లీడుకొచ్చిన సెలబ్రిటీస్ నుండి ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ వినిపిస్తుందా? లవ్, పెళ్లి లాంటివి ఇంకెప్పుడు అనౌన్స్ చేస్తారని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అయితే.. సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి వార్తలు వినిపించినా ఫ్యాన్స్ ఊరుకుంటారేమోగానీ, నెటిజన్స్ మాత్రం అసలు ఊరుకోరనే చెప్పాలి. సెలబ్రిటీల గురించి ఏ వార్త వినిపించినా దానిపై చర్చలు లేవనెత్తి.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు సుప్రీత గురించి కొన్ని వార్తలు చర్చనీయాంశంగా మారాయి.
సురేఖావాణి గురించంటే తెలుసుగానీ.. ఆమె కూతురు గురించి పెద్దగా తెలియదని కొంతమందిఅనుకోవచ్చు. కానీ.. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారందరికీ సురేఖావాణితో పాటు ఆమె కూతురు సుప్రీత కూడా ఐడియా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి చాలా ఫేమస్. కానీ.. సురేఖావాణి కూతురు ఇప్పటిదాకా సినిమాలైతే చేయలేదు. కానీ.. సోషల్ మీడియాలో తల్లితో పాటే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు మోడరన్ డ్రెస్సింగ్ స్టైల్, డిఫరెంట్ ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్న సుప్రీత.. త్వరలోనే ఫ్యాన్స్ కి పెళ్లి వార్త చెప్పబోతుందని అంటున్నారు నెటిజన్స్. అందుకు కారణం కూడా లేకపోలేదు.
ఇప్పుడిప్పుడే సినిమాలలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తోంది సుప్రీత. ఈ క్రమంలో అడపాదడపా టీవీ షోస్ లో కూడా పాల్గొంటుంటుంది. ఆ మధ్య ప్రైవేట్ సాంగ్స్ లో మెరిసిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా వాలెంటైన్స్ డే స్పెషల్ అంటూ జీ తెలుగువారు నిర్వహించిన ‘ఓ రెండు ప్రేమ మేఘాలు’ అనే ప్రోగ్రాంలో పాల్గొంది. అయితే.. లవ్ రిలేటెడ్ షో కదా.. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహతో జంటగా స్టేజ్ షోలో కనిపించి సర్ప్రైజ్ చేసింది. వీరిద్దరూ షోలో కనిపించి పరిచయం, జర్నీ గురించి చెప్పేసరికి అంతా లవ్ లో ఉన్నారని అనుకున్నారు. కానీ.. తాజాగా వీరిద్దరూ కలిసి ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసి లవ్ సింబల్ ని క్యాప్షన్ గా జోడించారు. ఇంకేముంది త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కామెంట్స్ మొదలెట్టేశారు నెటిజన్స్. ప్రస్తుతం సుప్రీత – నిఖిల్ జంటగా ఉన్న పిక్స్ వైరల్ గా మారాయి. మరి పెళ్లి రూమర్స్ పై వారే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.