క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఇటీవల సినిమాల కన్నా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకుంటుంది. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే సురేఖ వాణి ఇప్పుడు కాస్త స్లో అయ్యింది. సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. పైగా తన కూతురితో కలిసి సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తుంది. ఓల్డ్, లేటెస్ట్ పాటలకు రీల్స్, డ్యాన్స్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక తల్లీకూతులిద్దరు కలిసి వెకేషన్‌కు వెళ్తే.. అక్కడ వీరు చేసే రచ్చ మామూలుగా ఉండదు.
ఇక వీరిద్దరిపై ట్రోలింగ్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతుంది. దారుణంగా విమర్శలు చేస్తుంటారు నెటిజనులు. తాజాగా మరో సారి ట్రోలర్స్ బారిన పడింది సురేఖ వాణి. ఇంతకు నెటిజనులు సురేఖ వాణిని ఇంతలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారో తెలియాలంటే.. ఇది చదవండి.
అల్లు అర్జున్ నటించి సరైనోడు చిత్రంలోని ‘తెలుసా తెలుసా’ సాంగ్‌కు లిప్ సింక్ చేస్తూ వయ్యారంగా ఉయ్యాల ఊగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కొంచెం ఘాటుగానే స్పందిస్తున్నారు. అవసరమా ఈ సాంగ్స్ మీకు ‘ఈ ఏజ్‌లో మీకు ఆ సాంగ్ అవసరమా సురేఖ గారు’, ‘సురేఖ మేడమ్ మీ అమ్మాయి పెళ్లయ్యేదాకా కొంచెం ఇటువంటివి తగ్గించండి. లేదంటే మీ అమ్మాయిని చూసుకోడానికి వచ్చేవాడు మిమ్మల్ని చూస్తే.. మిమ్మల్నే చేసుకుంటాడు. మీరు అంటే నాకు చాలా ఇష్టం మేడమ్’ అంటూ కామెంట్స్ చేయగా మరికొందరు మాత్రం బ్యూటిఫుల్, నైస్, సూపర్ అంటూ అభిమానం కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.