టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖా వాణికి ఎంతో అభిమానులు ఉన్నారు. ఆమెలాగానే సుప్రిత అంటే కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతో అభిమానం ఉంది. సుప్రిత ఎప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేస్తుందంటూ ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు. సుప్రిత ఏం చేసినా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన థాయిలాండ్ వెకేషన్ కి సంంబంధించి ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.
సురేఖా వాణి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బాద్ షా సినిమాలో బ్రహ్మానందంతో ఉన్న ట్రాక్ కు కల్ట్ ఫ్యాన్ క్లబ్బే ఉంది. అయితే ఇన్నాళ్లూ టాలీవుడ్ కు దూరంగా ఉన్న సురేఖ.. ఈ మధ్య ప్రాజెక్టులు స్టార్ట్ చేసినట్లు కనిపిస్తున్నారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో సురేఖా వాణి ఎంత ఫేమసో ఆవిడ కుమార్తె కూడా అంతే ఫేమస్. ఎందుకంటే వారి తల్లీకూతుళ్ల కంటే అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తారు కాబట్టి. మరీ ముఖ్యంగా సురేఖా వాణిని సుప్రితతో పోలుస్తూ బాగా ఆటపట్టిస్తుంటారు. ఇద్దరు తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఏం పోస్ట్ చేసినా కూడా ఇట్టే వైరల్ అవుతుంది.
సుప్రిత బండారు ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. డైలీ యాక్టివిటీస్, పండగలు, షికార్లు ఇలా ఏదున్నా కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం థాయిలాండ్ టూర్ లో ఉన్న సుప్రిత తన వెకేషన్ హైలెట్స్ ని ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. అక్కడ తాను ఏక్స్ ప్లోర్ చేసిన ప్రాంతాలు, తన షాపింగ్, ఎంజాయ్ మెంట్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఇప్పటికే తాను పోస్ట్ చేసిన థాయిలాండ్ డైరీస్ కి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తనలో ఉన్న ధైర్యశాలిని పరిచయం చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
విషయం ఏంటంటే.. థాయిలాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సుప్రిత తాను ఓ పులి పిల్లను పట్టుకుంది. దానిని ఎంతో ధైర్యంగా పట్టుకుని ఆడించింది. అందుకు సంబంధించిన వీడియో తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ గా మారింది. ఇంక ఆమె కెరీర్ విషయానికి వస్తే.. సుప్రిత వెండితెర మీద వెలగాలంటూ సురేఖా వాణి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే కవర్ సాంగ్స్ తో తన టాలెంట్ నిరూపించుకున్న సుప్రిత.. కొన్ని ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంక త్వరలోనే మరిన్ని ప్రాజెక్ట్స్ తో అలరించే అవకాశం కూడా లేకపోలేదు. సుప్రిత ధైర్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.