సినీ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లకు అభిమానులు ఎంతో మంది ఉంటారు. ఒక్కోసారి నటులు బయటకు వచ్చినపుడు వారిని అభిమానులు చుట్టుముట్టడం చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భంగా నటీనటులు సహనం కోల్పోయి అభిమానులపై చిరాకుపడుతుంటారు.
సినీ ఇండస్ట్రీలో తన విలక్షణ నటనతో అందరి మన్ననలు పొంతుతూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు నటుడు విజయ్ సేతుపతి. భాషతో సంబంధం లేకుండా తనదైన నటనతో ప్రేక్షకుల మనసు దోచేస్తున్నాడు నటుడు విజయ్ సేతుపతి. ఎలాంటి పాత్రల్లో అయినా తన మార్క్ చాటుకుంటున్నాడు. ఇటీవల కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ పాన్ ఇండియా నటుడు. మూవీస్ లోనే కాకుండా వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ తో గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే విజయ్ సేతుపతిపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేయడమే కాదు.. ఆయనకు నాలుగు చివాట్లు పెట్టినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..
బెంగుళూర్ ఎయిర్ పోర్ట్ లో 2021 లో మహా గాంధీ అనే వ్యక్తితో నటుడు విజయ్ సేతుపతి కి గొడవ జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ సంఘటన తర్వాత విజయ్ సేతుపతిపై రక రకాలుగా కామెంట్స్ వినిపించాయి. కాగా, విజయ్ సేతుపతి, అతని అనుచరులు తనపై దారుణంగా దాడి చేశారని, తనని విజయ్ సేతుపతి బూతులు తిట్టాడని ఆరోపిస్తూ మహాగాంధీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులోనే ఉంది. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు నటుడు విజయ్ సేతుపతిని కోర్టుకు రావాల్సిందిగా తెలిపింది.
ఈ సందర్భంగా కోర్టు విజయ్ సేతుపతిని ‘మీరు సొసైటీలో మంచి పేరు ఉన్న నటులు.. అలాంటపుడు మీరు బయటకి వస్తే అభిమానులు ఏదో ఒక రకంగా కలవాలని చూస్తారు.. అతి తెలుసుకొని ప్రజలపై శ్రద్ద, గౌరవాన్ని చూపించాలి.. అంతేకానీ మీరు అసహనానికి గురై మీ ఇష్టం వచ్చినట్లు దూషించడం సరైన పద్దతి అనిపించుకోదని.. అలా తిడుతూ ప్రజల మధ్యలో తిరగలేరని..మిమ్మల్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారన్ని విషయం గుర్తు పెట్టుకోవాలిని’ హెచ్చరించింది. ఇద్దరి అంగీకారంతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అంతేకాదు తమ సమాధానం చెప్పేందుకు తదుపరి విచారణకు ఇరువురిని రావాలని ఆదేశిచింది. ఈ కేసు విచారణ మార్చి 2 కి వాయిదా వేసినట్లు ఉత్తర్వరులు ఇచ్చింది.