ది లెజెండ్ శరవణ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్ హీరోగా తెరకెక్కిన చిత్రం “ది లెజెండ్”. ఈ మూవీని ఆయనే స్వయంగా శరవణ ప్రొడక్షన్స్ పేరిట రూ.80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా జులై 28న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. జేడీ- జెర్రీ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో గీతిక, ఊర్వశీ రౌతెలా, ప్రభు, వివేక్, నాజర్ వంటి ప్రముఖ ఆర్టిస్టులు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ చిత్రంపై పాన్ ఇండియా రేంజ్‌లో చర్చ జరిగింది. ఇక సినిమా మీద వచ్చిన మీమ్స్ అయితే లెక్కేలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ అరుళ్ శరవణన్ కి నమష్కారం చేస్తూ పలకరించారు. అయితే తాజాగా అరుళ్ శరవణన్ కి సంబంధించిన ఈ పాత ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళ్తే..
గతంలో రజనీకాంత్ నటింటిన “అన్నాత్తే” అనే సినిమా షూటింగ్, లెజెండ్ శరవణన్‌ను నటించిన లెజెండ్ సినిమా షూటింగ్ లు చెన్నైలోని గోకులం స్టూడియోస్‌లో జరిగాయి. అన్నాత్తే సినిమాకి సిరుత్తై శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్, ఖుష్బు సుందర్ మరియు మీనా నటించారు. ‘ది లెజెండ్’ సినిమాకి జేడీ- జెర్రీ దర్శకత్వం వహించారు. అయితే రజనీకాంత్, అరుళ్ ల సినిమా షూటింగ్స్ ఒకే చోట కావడంతో ఇద్దరు కలుసుకున్నారు. ఈ సందర్భాంగా రజనీకాంత్.. శరవణన్ కు సంప్రదాయంగా నమస్తేతో పలకరించారు.
ఈ క్రమంలో వారు దిగిన ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇటీవల అరుళ్ శరవణన్ నటించిన ది లెజెండ్ మూవీ విడులైంది. ఈ క్రమంలో అరుళ్ పై సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వచ్చాయి. ఈ క్రమంలో రజనీకాంత్ అరుళ్ శరవణన్ ల పాత ఫోటో ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శరవణా మజాకా.. అంటూ ఈ పిక్ చూసిన కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీరి ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Superstar @rajinikanth and #LegendSaravanan met at #Chennai ‘s #Gokulam studios as they happened shoot for their respective movies.. pic.twitter.com/ANoUHqJDoT
— Ramesh Bala (@rameshlaus) March 24, 2021