తమిళ తలైవా రజనీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన సినీ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆయన అభిమానులతో పాటు రాజకీయ ప్రముఖులు రజనీ రాజకీయాలోకి వస్తారని భావించారు. అయితే తాను రాజకీయాల్లోకి రానని గతంలోనే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి కూడా రాజకీయాల్లోకి రీఎంట్రీపై తన అభిప్రాయం ఏమిటనేది తేల్చిచెప్పారు. సోమవారం ఆయన చెన్నైలోని రాజ్‌భవన్‌లో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాజకీయలోకి తన ఎంట్రీ విషయం గురించి మాట్లడారు.
గవర్నర్ తో భేటీకి ముందురోజు రజనీకాంత్ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. ఈక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన భేటీలో పాల్గొన్నారు. అయితే దిల్లీలో పర్యటనను ముగించుకుని రజనీకాంత్ చెన్నైకి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లి.. గవర్నర్ RN రవితో రజినీ సమావేశమయ్యారు. సుమారు గంట సమయం పాటు వీరి భేటి సాగింది. గవర్నర్ తో సమావేశం అనంతరం రజినీకాంత్ విలేకరులతో మాట్లాడారు. గవర్నర్‌ను కలుసుకోవడానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని తేల్చిచెప్పారు. వారిని మర్యాదపూరకంగా మాత్రమే కలిశాని రజనీ తెలిపారు.
ఏఏ అంశాలపై చర్చించారనే విషయాన్ని మాత్రం వెల్లడించడానికి తలైవా నిరాకరించారు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి రీఎంట్రీ ఆలోచన తనకు ఏ మాత్రం లేదని తెలిపారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమానికి రాజకీయాలతో సంబంధం లేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. మీ తరువాత ప్లాన్ ఏంటని మీడియా అడగ్గా.. సినిమా షూటింగే కదా! అంటూ రజినీకాంత్ నవ్వుతూ బదులిచ్చారు.
ప్రస్తుతం రజినీకాంత్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటించాల్సి ఉంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్ లు ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఇది త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నెల 15 లేదా 22వ తేదీన షూటింగ్ మొదలవుతుందని టాక్. మరి.. రాజకీయాలపై తలైవా చేసిన ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.