సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా పరశురామ్ తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఇటీవల విడుదలై, హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. 150 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతుంది. ఈ క్రమంలో సర్కారు వారి పాట సినిమా విజయంపై సూపర్ కృష్ణ గారు స్పందించారు. ఇదొక సూపర్ హిట్ ఫిలిం అని చెప్పిన అయన.. పోకిరి, దూకుడు కంటే కూడా చాలా బాగుంది అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూస్తుంటే.. అందరకి మంచి సినిమా చూశామనే అనుభూతి కలుగుతుందని చెప్పారు. జనాలు కుడి ఆబగా ఆధరిస్తున్నారని చెప్పిన కృష్ణ గారు.. ఓ ఛానల్ కావాలనే సినిమా బాగోలేదని తప్పుడు ప్రచారం చేసిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో సర్కారు వారి పాట చిత్రబృందం మూవీ సక్సెస్ మీట్ ని కర్నూల్ లో ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కి చిత్ర యూనిట్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా మహేష్ బాబు ఎంతో సంతోషాన్ని కనబరిచారు. అలాగే ఎన్నడూ స్టేజిపైకి వచ్చి కాలు కదపని మహేష్.. ఈసారి ఏకంగా మమ మహేశా.. పాటకు థమన్ తో, డాన్సర్స్ తో కలిసి మాస్ స్టెప్స్ చేయడం విశేషం. ఎంత పెద్ద నటులైనా వేదికలపై చిన్న డైలాగ్ చెప్పాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. కార్యక్రమ వ్యాఖ్యాత పట్టుబడితేనో, అభిమానులు కోరితేనో తప్పక ప్రదర్శన ఇస్తుంటారు. ఈ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే మహేష్ బాబు ఎవరి బలవంతం లేకుండానే వేదికపై నృత్యం చేయడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది.
ఇది కూడా చదవండి: నా బర్త్ డే.. నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా! అడగడానికి మీరు ఎవరు? : ఐరా ఖాన్