సినీ ఇండస్ట్రీలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి మంచి స్నేహితులు. ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చినా.. మెగాస్టార్ చిరంజీవిని కలుస్తుంటారు అమీర్ ఖాన్. మిస్టర్ పర్ఫెక్ట్, సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగ చైతన్య నటించారు. ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమయిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ లో లాల్ సింగ్ చద్దా మూవీకి సంబందించిన ప్రీవ్యూని మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ లో పలువురు సినీ పెద్దల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వారం మొదట్లో ఈ ప్రత్యేక ప్రివ్యూని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప్రదర్శించినట్లు తెలుస్తుంది. ఈ ప్రివ్యూని తిలకించడానికి రాజమౌళితో పాటు సుకుమార్, నాగార్జున, నాగ చైతన్య లు విచ్చేశారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ నటన ఎంతో గొప్పగా ఉందని.. అందరూ ప్రశంసించారు.
ఆ మద్య లాల్ సింగ్ చద్దా కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. ఇందులో అమీర్ తన అమాయకత్వంతో అందరి మనసు గెల్చుకుంటాడని తెలుస్తుంది. తల్లీకొడుకుల మద్య ఉండే అనుబంధం ఈ మూవీలో ఎంతో గొప్పగా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ హాలీవుడ్ లో ఫారెస్ట్ గంప్ కి రిమేక్ గా తెరకెక్కించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.