ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మ.. మ.. మ.. మహేసా అనే సాంగ్ రీసౌండ్ వస్తోంది. ఎక్కడ చూసిన సర్కారు వారి పాట సినిమా ఫీవర్ కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్, ముఖ్యంగా మహేసా అనే సాంగ్ తర్వాత ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, మహేశ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అటు ప్రమోషన్స్ కూడా పెద్దఎత్తున చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తన అభిమానులకు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఈ సినిమాని థియేటర్లలో మాత్రమే చూడాలంటూ మహేశ్ కోరారు.
ఇదీ చదవండి: పుష్ప-2 కోసం ఊహలకి కూడా అందని మాస్టర్ ప్లాన్!
అసలు అభిమానులకు రాసిన లేఖలో మహేశ్ ఏమన్నాడంటే.. ‘ప్రముఖ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ, 14 రీల్స్ వంటి ప్రముఖ సంస్థలపై, ఎర్నేని నవీన్, యలమంచిలి రవి శంకర్, ఆచంట రామ్, ఆచంట గోపిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన సర్కారు వారి పాట సినిమాని థియేటర్లలోనే చూసి స్పందన తెలియజేయగలరు’ అంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులను కోరాడు.
SuperStar Mahesh Babu heart full letter to fans.#SarkaruVaariPaata#SVPMania #SVP@urstrulyMahesh pic.twitter.com/AlY1MXk5q3
— Dev 🔔 #SVPonMay12th (@divii51) May 7, 2022
అంతే కాకుండా.. తర్వాత త్రివిక్రమ్ తో తాను చేయబోయే సినిమా గురించి కూడా తన లేఖలో అధికారిక ప్రకటన చేశాడు. మాటల మాంత్రికుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక &హాసిని బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించే చిత్రం రెగ్యులర్ షూటంగ్ జూన్ లో మొదలు కానుందని తెలియజేశాడు. ఇంక సినిమా విషయానికి వస్తే.. సర్కారు వారి పాట మూవీకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మహేశ్ బాబు లుక్స్, డైలాగ్స్ అన్నీ పోకిరి సినిమాని గుర్తు చేస్తున్నాయని.. తప్పకుండా సూపర్ డూపర్ హిట్ కొడుతుందంటూ ఇప్పటికే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సర్కారు వారి పాట సినిమా కోసం మీరూ ఎదురుచూస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.