తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారు.
గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన తుది శ్వాస విడిచారు. బాల నటుడిగా అల్లూరి సీతారామరాజు చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి కృష్ణతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. సామ్రాట్ చిత్రంతో హీరోగా మారారు.
సూర్య వంశం(హింది).అతిధి, అర్జున్ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. 1997 నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు రమేష్ బాబు. ఆయన మృతితో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కృష్ణ ఇంట తీవ్ర విషాద ఛాయలు నిండాయి.