టాలీవుడ్ టార్చ్ బేరర్, జేమ్స్ బాండ్, కౌబాయ్, సూపర్ స్టార్ కృష్ణ మే 31న 80వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మహేశ్, నమ్రతా దంపతులు కూడా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ కృష్ణకు విషెస్ చెప్పారు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశారు. నష్టం వస్తుందేమో.. ప్రేక్షకులు ఆదరించరేమో అనే భయం లేకుండా అనుకున్నదే తడవుగా ఎన్నో వినూత్న చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకాదరణ పొందారు. తొలి కౌబాయ్, తొలి ఈస్ట్ మన్, తొలి 70ఎంఎం, తొలి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ సొంతం.
ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణకు పుట్టినరోజు నాడు మరో అరుదైన గౌరవం దక్కింది. ‘సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్స్’ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని స్వయంగా సినీ నటుడు నరేశ్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Happy birthday SUPER STAR . Glorious 80 years of service to cinema and people . Received CELEBRITY BOOK OF WORld RECORDS on this occasion. Long live the superstar💕🌹 pic.twitter.com/WBuZko8EH3
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) May 31, 2022
‘సూపర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలు, సినిమాకి మీరు 80 ఏళ్లుగా సేవ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మిమ్మల్ని సెలబ్రిటీ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరించడం సంతోషంగా ఉంది. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలి’ సూపర్ స్టార్ కృష్ణకు కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలను తెలియజేయండి.
Happy birthday Nanna! There is truly no one like you. Wishing for your happiness & good health for many more years to come. Stay blessed always. Love you ♥️🤗🤗 pic.twitter.com/rJKvVQoHQq
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2022