తెలుగు చిత్ర పరిశ్రమను శాసించిన హీరోలలో సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఆయన కెరీర్ లో సక్సెస్ రేట్ ఎక్కువగా మెయింటైన్ చేశారు. ఆ రోజుల్లో కృష్ణ గారికి ఉన్న అభిమాన సంఘాలు వేరెవరికీ లేవేమో అంటున్నాయి సినీ వర్గాలు. ఇప్పుడు వయసు మీదపడటం వలన ఇంటివద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్లలో తప్ప ఎక్కువగా బయట కనిపించడం లేదు.
తాజాగా సూపర్ స్టార్ కృష్ణకు సంబంధించి ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కంగారు పడ్డారు. ఇటీవల తమ ఫ్యామిలీ ఫంక్షన్లో ఆయన పాల్గొనగా.. అక్కడ ఫ్యామిలీతో దిగిన ఫోటోలను కృష్ణ కూతురు, మహేశ్ బాబు సోదరి మంజుల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే.. లేటెస్ట్ ఫోటోలలో కృష్ణ గారి ముఖంలో ఎదో తేడాగా కనిపిస్తుందని ఫ్యాన్స్ ఆందోళన చెందారు.
వెంటనే కృష్ణ గారికి ఏమైందని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణగారి ఫ్యామిలీ మెంబర్స్ ఆయన ఫోటోస్‌పై క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ ఫంక్షన్ లో ఆయన ఇన్విజిబుల్ ఫేస్ మాస్క్ ధరించారని.. అది ముఖంలో కలిసిపోవడం వల్ల అలా కనిపించిందని తెలిపారు. అలాగే కృష్ణగారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మరి సూపర్ స్టార్ కృష్ణగారి కొత్త ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.