కొంతమంది హీరోయిన్స్ ఒక్క సినిమా చేసినప్పటికీ.. వారు వదిలి వెళ్లిన ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇంకొన్నాళ్లు ఆమె తెరపై కనిపిస్తే బాగుండు అనే ఫీలింగ్ ఏదొక సమయంలో కలుగుతుంది. అలా తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి కనుమరుగైన హీరోయిన్స్ లో అయేషా టాకియా ఒకరు.
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా వెలుగు వెలిగిన బ్యూటీలు సడన్ గా కనిపించకుండా పోతే.. వారు ఏమైపోయారు అనే సందేహాలు అందరిలోనూ కలుగుతుంటాయి. కొంతమంది హీరోయిన్స్ ఒక్క సినిమా చేసినప్పటికీ.. వారు వదిలి వెళ్లిన ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇంకొన్నాళ్లు ఆమె తెరపై కనిపిస్తే బాగుండు అనే ఫీలింగ్ ఏదొక సమయంలో కలుగుతుంది. అలా తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసి కనుమరుగైన హీరోయిన్స్ లో అయేషా టాకియా ఒకరు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ మూవీతో టాలీవుడ్ కి పరిచయమైంది ఈ ముంబై బ్యూటీ. అప్పటికే హిందీలో హీరోయిన్ గా సక్సెస్ లలో ఉంది.
అలా ఫామ్ లో ఉన్న అయేషాని 2005లో సూపర్ సినిమాతో పరిచయం చేశాడు పూరి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తరుగానే ఆడినప్పటికీ.. అయేషాకి మంచి క్రేజ్ దక్కింది. దీంతో టాలీవుడ్ కి మరో క్యూట్ హీరోయిన్ దొరికిందని అందరూ భావించారు. కానీ.. అంతలోనే ఈ భామ.. తెలుగులో సినిమాలు చేయకుండా వరుసగా హిందీలో చేసుకుంటూ.. అక్కడే సెటిల్ అయిపోయింది. ఇంకేముంది అందరూ అనుకున్నట్లుగా అయేషా తెలుగులో కంటిన్యూ కాలేదు. కానీ.. ప్రేక్షకులలో ఆమె ఉంటే బాగుండనే ఫీలింగ్ మాత్రం అలాగే మిగిల్చింది. పైగా ‘గుచ్చి గుచ్చి చంపమాకు’ అంటూ ఓ రొమాంటిక్ సాంగ్ కూడా జ్ఞాపకంగా వదిలి వెళ్ళింది.
ఆ తర్వాత చేసేదేం లేక.. అదే సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మరో బ్యూటీ అనుష్కని ఆరాధించడం మొదలుపెట్టారు ఆడియెన్స్. కట్ చేస్తే.. అనుష్క అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఒక అరుంధతి, ఒక బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. మరోవైపు టాలీవుడ్ డెబ్యూ చేసిన నాలుగేళ్లకే అయేషా.. సినిమాలు మానేసి ఓ బిజినెస్ మ్యాన్ ఫర్హాన్ అజ్మిని పెళ్లాడింది. అప్పటినుండి సినిమాలవైపు తొంగి చూడకుండా తన ఫ్యామిలీ, హస్బెండ్, పిల్లలపైనే ఫోకస్ పెట్టేసి.. పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తోంది. ప్రస్తుతం అమ్మడి వయసు 36 ఏళ్ళు. అంటే సుమారు 18 ఏళ్ళ వయసులో తెలుగు డెబ్యూ చేసింది. ఇక సోషల్ మీడియాలో అడపాదడపా యాక్టీవ్ గా ఉంటున్న అయేషాకు సంబంధించి కొత్తగా కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటోలలో అయేషాని చూసి.. ఏంటీ సూపర్ హీరోయిన్ ఇంతలా మారిపోయిందా? అని షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి అయేషా టాకియాపై మీరు కూడా ఓ లుక్కేసి.. అప్పటికీ, ఇప్పటికీ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి.