సన్నీలియోన్ ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ఒక సెన్సేషన్. ఈ పేరు తెలియని ప్రేక్షకుడు ఉండడు. జిస్మ్ 2 మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సన్నీలియోన్.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించారు. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె తనపై కొంతమంది చూపిస్తున్న వివక్ష గురించి ప్రస్తావించారు. తాను బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పుడు తనతో కలిసి పని చేయడానికి చాలా మంది వెనకడుగు వేశారని, అయితే కొంతమంది మాత్రం తనతో కలిసి నటించేందుకు ముందుకు వచ్చారని అన్నారు.
కానీ పెద్ద నిర్మాణ సంస్థలు, స్టార్ హీరోలు తనతో కలిసి నటించేందుకు ఇప్పటికీ సంకోచిస్తున్నారని అన్నారు. అయితే దీని గురించి తానేమీ బాధపడడం లేదని, ఎందుకంటే ఏదో ఒక రోజు వారితో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని అశిస్తున్నానంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఈమె తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న జిన్నా సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. అలానే తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కొన్ని ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి సన్నీలియోన్ చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.