దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు సన్ని లియోన్ గురించిన పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోనూ ఆమె సినిమాలు చేస్తున్నారు. ఓ నాడు పోర్న్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న ఈమె నేడు నటిగా మంచి ఆదరణ పొందుతున్నారు. కరెంట్ తీగ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాతి కాలంలో పలు తెలుగు సినిమాల్లో నటించారు. తాజాగా కూడా జిన్నా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అయితే, పోర్న్ స్టార్‌గా ఉన్న ఆమె గత జీవితం చాలా బాధాకరమైనదని సన్నీ లియోన్ చెప్పుకొచ్చారు. పోర్న్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను ఎదుర్కొన్న అవమానాలు, ట్రోలింగ్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ..
‘‘ పోర్న్ స్టార్‌గా కెరీర్ మొదలు పెట్టిన కొత్తలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. నన్ను అసహ్యించుకుంటూ చాలా మెయిల్స్ వచ్చేవి. చంపుతానని కూడా బెదిరించే వారు. అవన్నీ చూస్తుంటే ఇక ఇండియాకు వెళ్లలేనేమోనని అనిపించేది. ఎందుకంటే.. భారత ప్రజలు నాపై చాలా కోపంగా ఉండేవారు. ఆ మెయిల్స్ వచ్చినపుడు నా వయసు 19-20 సంవత్సరాలు మాత్రమే. ఆ వయసులో మనల్ని చాలా విషయాలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. నేను అప్పుడు ఒంటరిగా ఉండేదాన్ని. నన్ను ఎవరైనా గైడ్ చేస్తే బాగుండు అని అనుకునేదాన్ని కాదు. అదేం కాదు అని నాతో చెప్తే బాగుండు అని కూడా అనుకునేదాన్ని కాదు.
ఆ అనుభవాలన్నీ చాలా దారుణమైనవి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సన్ని లియోన్ జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇక అప్పటినుంచి పోర్స్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. భర్త డేనియల్ వెబర్‌తో కలిసి ఇండియాకు వచ్చి సెటిల్ అయ్యారు. 2013 వడాకర్రీ అనే సినిమాతో సౌత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. కొంతమంది పిల్లలను దత్తత తీసుకుని వారిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. మరి, సన్ని లియోన్ తన గత జీవితం గురించి చెబుతూ ఎమోషనల్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.