నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దు! ఆ టాప్ హీరో అభిమానులకి సునిశిత్ క్షమాపణలు

నెగెటివ్ కామెంట్లు చేసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ తెచ్చుకున్నాడు సునిశిత్. ఇటీవలే చరణ్ సతీమణి ఉపాసన గురించి షాకింగ్ కామెంట్స్ చేసి మెగా ఫ్యాన్స్ చేతిలో చావు దెబ్బలు తిన్న సునిశిత్.. తాజాగా మరో టాప్ హీరో ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు.

జీవితంలో షార్ట్ కట్స్ కి నో ఛాన్స్. కష్టపడితేనే పాపులారిటీ వస్తుందో రాదో చెప్పలేం కానీ.. నెగటివ్ కామెంట్లు చేస్తే మాత్రం చాలా త్వరగా పబ్లిసిటీ వస్తుంది. అలాంటి వివాదాస్పద కామెంట్లు చేసి అందరికీ పరిచయం అయ్యాడు శాక్రిఫైసింగ్ స్టార్ సునిశిత్. పబ్లిసిటీ కోసం అడ్డదారుల్లో వెళ్తే ఫలితం ఎలా ఉంటుందో సునిశిత్ చూస్తే తెలిసిపోతుంది. టాప్ హీరోలని, హీరోయిన్లని టార్గెట్ చేసి, వారి గురించి అర్ధం లేని వ్యాఖ్యలు చేస్తూ.. ఎవరికీ నమ్మశక్యం కానీ మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసాడు. అసలు సునిశిత్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో ఎవ్వరికీ అర్ధం అయ్యేది కాదు. ఇతడి వ్యాఖ్యలు చూసి మొదట్లో నవ్వుకున్న నెటిజన్స్ ఆ తర్వాత హద్దుమీరడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ బాగా బుద్ధి చెప్పాడు. అయినా నా పంతం మార్చుకోను అన్నట్లు ఈ సారి తారక్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు సునిశిత్.

సునిశిత్ ఇటీవల రాంచరణ్ సతీమణి ఉపాసన గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఉపాసనతో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్లానని.. చరణ్ కూడా నాకు కావడంతో ఉపాసనాను పడేయమని సరదాగా చెప్పాడని సునిశిత్ చెప్పుకొచ్చాడు. సమాజంలో ఎంతో మంచి పేరున్న ఉపాసన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఏ మాత్రం నచ్చలేదు. చరణ్ ఫ్యాన్స్ చావబాదినప్పటికీ సునిశిత్ తీరు మారినట్లుగా కనిపించడం లేదు. ఇది జరిగిన కొన్ని రోజులకే జూ.ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ మరో ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. “ఎన్టీఆర్ పెద్ద హీరో కదా.. కానీ అతను అశ్లీల చిత్రాల్లో నటించారు. ఈ విషయం టాలీవుడ్ లో ఎవ్వరూ చెప్పరు.సునిశిత్ అనే హీరో తప్ప”. అంటూ తన గురించి తానూ బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.

ఈ మాటలకు చిర్రెత్తుకొచ్చిన తారక్ ఫ్యాన్స్ ఇప్పుడు సునిశిత్ కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. సునిశిత్ తమకి దొరికితే మాత్రం తగినశాస్తి చేస్తాం నీకు చావే అంటూ బెదరించడం జరిగింది. దీనితో భయపడిన సునిశిత్.. దిగి వచ్చి క్షమాపణ చెప్పాడు. “నన్ను, నా ఫ్యామిలీని దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. తారక్ పై చేసిన కామెంట్స్ కి క్షమాపణ కోరుతున్నా. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయను. నేను కూడా తారక్ అభిమానినే.. కానీ పబ్లిసిటికి వస్తుందని ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నా. ఇకపై నా నుంచి ఇలాంటివి ఉండవు” అని సునిశిత్ తెలియజేశాడు. మొత్తానికీ ఈ క్షమాపణతో సునిశిత్ పూర్తిగా మారినట్టేనా? లేకపోతే మరో హీరోకి టార్గెట్ అవుతాడేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed