వైవిధ్యమైన పాత్రలతో తెలుగు వారి గుండెల్లో నటుడిగా చెరగని ముద్ర వేసుకున్నటువంటి నటుడు రాజీవ్ కనకాల. పాత్ర ఏదైనా గానీ మెప్పించగల సమర్ధుడు రాజీవ్ కనకాల. పేరులో రాజీ ఉన్నా గానీ నటనలో మాత్రం రాజీతనం లేదు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినా, కొంచెం కామెడీ టచ్ ఉన్న కేరెక్టర్ అయినా, విపరీతమైన భావోద్వేగంతో కూడిన పాత్ర అయినా.. ఏ పాత్రైనా సరే ఆయన చేస్తే నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. ఈ పాత్ర ఈయన కాకుండా ఇంకెవరైనా చేస్తే బాగుంటుంది అన్ని ఊహ కూడా మనకి రానివ్వనంత అద్భుతంగా నటిస్తారు. ఇక ఈయన సతీమణి సుమ కనకాల మాత్రం ఈయనకి పూర్తిగా భిన్నంగా ఉంటారు. ఆయన సినిమాల్లో అంత సీరియస్ రోల్స్ లో నటిస్తే.. సుమ మాత్రం బయట చాలా సరదాగా ఉంటారు. తనదైన పంచులతో అందరినీ నవ్విస్తూ ఉంటారు.
ఒకరు నటిస్తూ మెప్పిస్తే, మరొకరు నవ్విస్తూ మెప్పిస్తారు. ఇద్దరూ ఇద్దరే. టాలీవుడ్ లో అన్యోన్యంగా ఉండే జంటల్లో రాజీవ్, సుమ జంట ఒకటి. ఎవరి కెరీర్ లో వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ దాంపత్య జీవితాన్ని బేలన్సింగ్ చేసుకుంటూ వస్తున్నారు. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగా సుమ.. తన భర్త రాజీవ్ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేశారు. నవంబర్ 13న రాజీవ్ కనకాల పుట్టినరోజు కావడంతో సుమ.. రాజీవ్ తో కేక్ కట్ చేయించారు. రాజీవ్ తో కలిసి సరదాగా బయటకు వెళ్లారు. పడవ మీద షికారు చేస్తూ.. టైటానిక్ సినిమాలో హీరో, హీరోయిన్స్ లా ఫోజు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.