ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2. గతేడాది విడుదలై పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పుష్ప సినిమాకి సీక్వెల్ గా ‘పుష్ప 2’ రూపొందుతోంది. ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ కి ఎంత ప్రాధాన్యత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ భాషలోనైనా ఒక సినిమా ఊహించని విజయాన్ని నమోదు చేస్తే.. వెంటనే దానికి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అదీగాక సినిమా నచ్చితే.. ప్రేక్షకులే సీక్వెల్ కావాలంటూ రిక్వెస్ట్ చేస్తుండటం కూడా చూస్తున్నాం. అయితే.. ఎప్పుడైనా సరే మొదటి సినిమాకంటే దాని తర్వాత వచ్చే సీక్వెల్ పైనే భారీ అంచనాలు నెలకొంటాయి.
ఇప్పుడు ఇండియాలో అంచనాల పరంగా భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమా పుష్ప 2. గతంలో బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాలతో పాటు రీసెంట్ గా అవతార్ 2 సినిమాపై ఉన్న హైప్ చూశాం. ఈ వరుసలో ప్రెజెంట్ పుష్ప 2 చేరింది. 2021 డిసెంబర్ లో విడుదలైన పుష్ప సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో తెలిసిందే. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత బన్నీ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో బజ్ బాగా క్రియేట్ అయ్యింది. ఇక శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రఫ్ అండ్ రగ్గడ్ పుష్పరాజ్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ జీవించేశాడు. పుష్పరాజ్ గా బన్నీ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, చిత్తూర్ యాస, యాక్షన్ ఎఫర్ట్స్ అన్నీ మాస్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.
దీంతో పుష్ప సీక్వెల్ పై బజ్ ఊహించని స్థాయిలో నెలకొంది. అదీగాక ఈ ఏడాది ఎక్కువ దేశాలకు విస్తరించిన తగ్గేదే లే.. సింబాలిక్ సిగ్నేచర్ కూడా పుష్ప 2పై హైప్ కి కారణమైంది. అప్పటినుండి పుష్ప 2 షూటింగ్ తో పాటు సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుండగా.. సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాతో పాటు సినీవర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. సుకుమార్ చెప్పిన మాటలు పుష్ప 2 మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తూనే, ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి.
మరి పుష్ప 2 విషయంలో తాజాగా సుకుమార్ ఏమన్నారంటే.. “పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది. మీ హీరో అల్లు అర్జున్.. పుష్పరాజ్ క్యారెక్టర్ లో మరింత ఎక్సట్రా ఎఫర్ట్స్ పెడుతూ యాక్టింగ్ ఇరగ్గొట్టేస్తున్నాడు. ప్రతి ఎక్సప్రెషన్ తో పాటు ప్రతి డీటైలింగ్ పై దృష్టి పెడుతున్నాడు. నేనెప్పుడూ నా సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడను. కానీ.. పుష్ప 2 గురించి ఒకటే మాట చెప్తాను.. ఇది నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది.” అని అన్నారు. ఆ వెంటనే బన్నీ మాట్లాడుతూ.. ‘నేను సినిమా గురించి ఎక్కువ చెప్పాలని గాని, ఓవర్ కాన్ఫిడెన్స్ తో గాని చెప్పట్లేదు.. బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప 2 అస్సలు తగ్గేదే లే’ అనిపించబోతుంది’ అని చెప్పాడు. దీంతో వీరిద్దరి మాటలు వినేసరికి బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.