జైలులో ఉన్న అతడు తన ప్రియురాలు జాక్వెలిన్ పెర్నాడజ్‌కు ప్రేమ లేఖ రాశాడు. ఈ లేఖలో జాక్వెలిన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఆమె మీద ఉన్న ప్రేమను అక్షరాల రూపంలో తెలియజేశాడు.
మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపార వేత్త సుఖేష్ చంద్రశేఖర్ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సుఖేష్ తన ప్రియురాలు, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాడజ్‌కు ప్రేమ లేఖ రాశాడు. ఈస్టర్ పండుగ సందర్భంగా సుఖేష్ ఈ లేఖ రాశాడు. ఆ లేఖలో ఈ విధంగా ఉంది.. ‘‘ ‘‘నా బేబీ.. నా బొమ్మ జాక్వెలిన్.. నీకు ఈస్టర్ శుభాకాంక్షలు. ఇది నీకు ఎంతో ఇష్టమైన పండుగ. నీకు ఈస్టర్ ఎగ్స్ అంటే చాలా ఇష్టం. నీకు తెలుసా? నువ్వు ఎంత అందంగా ఉంటావో..
ఈ విశ్వంలో నీ అంత అందంగా ఇంకెవ్వరూ ఉండరు. మనమిద్దరమూ ఎల్లప్పుడూ ఒక్కటే. నేను ‘‘ తుమ్ మిలే, ఔర్ దిల్ కిలే, ఔర్ జీనేకో క్యా ఛాహియో’ అన్న పాట విన్న ప్రతీసారి నువ్వే గుర్తుకు వస్తావు. మనకు మంచి రోజులు రాబోతున్నాయని నేను నీకు హామీ ఇస్తున్నాను’’ అని అన్నాడు. సుఖేష్ జైలు నుంచి ఇలా జాక్వెలిన్‌కు ప్రేమ లేఖలు రాయటం ఇది మూడో సారి. ఈ సారి ఈస్టర్ సందర్భంగా తన తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలిపాడు. కాగా, సుఖేష్‌పై ఇప్పటి వరకు 30కిపైగా కేసులు నమోదు అయి ఉన్నాయి.
రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇతర ప్రముఖులపై బెదిరింపులకు పాల్పడ్డట్టు, డబ్బులు తీసుకున్నట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా చాలాసార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై విడుదలయి వచ్చి జాక్వెలిన్‌తో ప్రేమ వ్యవహారం నడిపాడు. సుఖేష్‌పై ఈడీ దర్యాప్తు చేస్తున్న సమయంలో జాక్వెలిన్‌తో పాటు మరికొంతమంది సినిమా తారలను కూడా విచారణకు పిలిచింది. ఈ కేసుతో వారికి సంబంధం లేదని తెలిసింది. మరి, జైలులో ఉన్న సుఖేష్ తన ప్రియురాలికి ఈస్టర్ సందర్భంగా లవ్ లెటర్ రాయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.