ఒకప్పుడు సినిమా వాళ్లను చూడాలన్నా.. వారితో కాంటాక్ట్ కావాలన్నా.. ఏదైనా సినిమా వేడుకకు వచ్చినప్పుడో.. లేక పరిసర ప్రాంతాల్లో ఎక్కడైన షూటింగ్ జరిగితేనో సాధ్యం అయ్యేది. ఇక అభిమాన తారలకు లేఖలు రాసే వాళ్లు కోకొల్లలు. ఎప్పుడైనా రిప్లై వస్తే.. ఇక ప్రపంచాన్ని గెలిచినంత సంబర పడేవాళ్లు. అయితే ప్రస్తుతం కాలం మారింది. సోషల మీడియా వినియోగం పెరగడంతో.. సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు వెంటనే తెలిసిపోతున్నాయి. ఇక సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ.. తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ని వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక సోషల్ మీడియాను వినియోగించడంలో ఈ తరం నటీనటులతో పోటీ పడుతున్నారు కొందరు సీనియర్ స్టార్లు. ఈ జాబితాలో ముందుంటారు సీనియన్ హీరోయిన్ సుహాసిని. లేటెస్ట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటారు. ఇక తాజాగా సుహాసిని సోసల్ మీడియా పోస్ట్‌కు ఓ నెటిజన్ చేసిన కామెంట్.. అందుకు సుహాసిని ఇచ్చిన రిప్లై వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
సుహాసిని సోషల్ మీడియాలో ఎక్కువగా తకన ఫోటోలను షేర్ చేస్తుంటారు. తన సినిమాలు, ప్రాజెక్ట్‌లు, షోలకు సంబంధించిన క్యాస్టూమ్స్‌తో సుహాసిని ఫోటో షూట్ చేస్తుంటుంది. ఆ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తుంటారు. అలానే తాజాగా కొన్ని ఫోటోలను ఆమె షేర్ చేశారు.ఆ ఫోటోలకు ఓ నెటిజన్ ‘మీరు 16 ఏళ్ల అమ్మాయిలో కనిపిస్తున్నారు.. అందంగా ఉన్నారు.. లవ్యూ మేడం’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.
దానికి సుహాసిని ఎంతో ఫన్నీగా రిప్లై ఇచ్చారు. హహ అంటూ నవ్వేస్తూ.. జస్ట్ ఆ నంబర్‌ను రివర్స్ చేస్తే అదే నిజం అని తన వయసు 61 అని చెప్పకనే చెప్పేసింది. మొత్తానికి సుహాసిని టైమింగ్‌కు అంతా ఫిదా అవుతున్నారు. సుహాసిని రీసెంట్‌గా హైద్రాబాద్ మోడ్రన్ లవ్ వెబ్ సిరీస్‌లో అద్భుతంగా నటించారు. అమ్మమ్మ పాత్రలో సుహాసిని అదరగొట్టేశారు. ఇక ఇప్పుడు ఆమె కొన్ని తెలుగు చిత్రాలను కూడా చేస్తోన్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా సుహాసిని తనకు నచ్చిన పాత్రలను పోషించుకుంటూ వెళ్తోన్నారు.