తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా క్రేజ్ సంపాదించుకున్న సుధీర్.. తన కామెడీ టైమింగ్ తో తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక టీవీ షోలతో పాటు సుధీర్ అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. సుధీర్ ప్రధాన పాత్రలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాను ప్రెజెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుధీర్ సరసన దీపికా పిల్లి జంటగా నటిస్తోంది. ఇక సునీల్, అనసూయ, విష్ణుప్రియ, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగష్టు 19న విడుదల అవుతుండగా.. సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు సుధీర్ అండ్ టీమ్. ఈ క్రమంలో సుధీర్ కామెడీ టైమింగ్, ఎక్సప్రెషన్స్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి సుధీర్ ఇచ్చిన ఆన్సర్ వింటే తాను ఎవరెవరిని బాగా అభిమానిస్తాడో అర్థమవుతుంది.
ఇక సుధీర్ మాట్లాడుతూ.. ‘మొదటి నుండి నేను ఎదుటివాళ్ళ స్టయిల్ ని కాపీ కొట్టేందుకు ట్రై చేస్తున్నాను. ముఖ్యంగా బ్రహ్మానందం గారు, శ్రీనివాస్ రెడ్డిల కామెడీ టైమింగ్ లను మిక్స్ చేసి నేనేదో కొత్తగా ప్రెజెంట్ చేసేందుకు చూస్తాను. స్టైల్ లో రజినీకాంత్ గారు, డ్యాన్స్ లో చిరంజీవి గారు, రియల్ లైఫ్ బిహేవియర్ లో పవన్ కళ్యాణ్ గారు ఇలా అందరి నుండి చూసి నేర్చుకున్నవే తప్ప.. బై బర్త్ యాక్టర్ ని కాదు” అంటూ చెప్పుకొచ్చాడు సుధీర్. ప్రస్తుతం సుధీర్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి సుధీర్ స్టైల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.