సుడిగాలి సుధీర్ సూపర్ ఛాన్స్ కొట్టేశాడు! ఏకంగా ప్రభాస్ తో హిట్ మూవీ తీసిన ఓ డైరెక్టర్ తో కలిసి పనిచేసేందుకు రెడీ అయిపోయాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు?
సుడిగాలి సుధీర్ ని అతడి ఫ్యాన్స్ ముద్దుగా బుల్లితెర సూపర్ స్టార్ అంటుంటారు. టీనేజ్ లో ఓ మెజీషియన్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ‘జబర్దస్త్’ స్టార్ట్ అయిన తర్వాత కమెడియన్ గా మారిపోయాడు. సుడిగాలి సుధీర్ పేరుతో టీమ్ లీడర్ గా చాలా ఫేమస్ అయిపోయాడు. ఓవైపు యాక్ట్ చేస్తూనే మరోవైపు షోలకు యాంకరింగ్ చేస్తూ, ప్రేక్షకుల్ని పిచ్చపిచ్చగా ఎంటర్ టైన్ చేశాడు. సినిమా హీరోగా ‘గాలోడు’ లాంటి మూవీతో సక్సెస్ అందుకున్నాడు. ఇలా మల్టీటాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకున్న సుధీర్.. కొన్నాళ్ల నుంచి సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడేమో అదిరిపోయే క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే అందరికీ రష్మీనే గుర్తొస్తుంది. అలాంటిది వీళ్లిద్దరూ ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. అంటే ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’లో రష్మీ యాంకరింగ్ చేస్తుండగా.. సుధీర్ మాత్రం పూర్తిగా టీవీ షోలకు దూరమై సినిమాలపై దృష్టి పెట్టాడు. గతేడాది ‘గాలోడు’ లాంటి మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చి, అద్భుతమైన కలెక్షన్స్ అందుకున్నాడు. రొటీన్ కథే అయినప్పటికీ హిట్ కొట్టేశాడు. దీంతో నెక్స్ట్ ఏ సినిమా రిలీజ్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ‘కాలింగ్ సహస్ర’ అని ఓ మూవీ చేస్తున్నాడు. కానీ దాని అప్డేట్స్ పెద్దగా రావడం లేదు.
మరోవైపు సుధీర్ తో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అలా దర్శకుడు దశరథ్.. ‘గాలోడు’తో మూవీ ప్లాన్ చేశాడట. ప్రభాస్ తో ‘మిస్టర్ ఫెర్ఫెక్ట్’ లాంటి మూవీ తీసి హిట్ కొట్టినప్పటికీ ఆ తర్వాత తర్వాత ఫేడౌట్ అయిపోయాడు. మంచు మనోజ్ తో చాలా ఏళ్ల క్రితం ‘శౌర్య’ చేశాడు. ఆ తర్వతా డైరెక్టర్ గా మరో మూవీ చేయలేదు. ఇప్పుడు సుధీర్ తో చేయబోయే మూవీతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సుధీర్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే అని చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో? మరి ఈ విషయమై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.