సుడిగాలి సుధీర్.. ఆ పేరుకున్న క్రేజే వేరు. సామాన్యంగా హీరోలకు అభిమానులుంటారు. కానీ ఓ బుల్లి ఆర్టిస్ట్‌కి ఇంతమంది అభిమానులుండటం చాలా రేర్. ఆ ఫీట్ సాధించాడు సుధీర్. జబర్దస్త్‌లోకి సామాన్య కంటెస్టెంట్‌గా వచ్చి.. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి.. నేడు బుల్లితెర సూపర్ స్టార్‌గా ఎదిగాడు సుధీర్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి తత్వమే ఇంతటి అభిమానానికి కారణం. ప్రస్తుతం యాంకర్‌గా, కంటెస్టెంట్‌గా, హీరోగా రాణిస్తున్నాడు సుధీర్. జీవితంలో ఏదో సాధించాలనే కసితో హైదరాబాద్ వచ్చి.. మెజిషియన్‌గా కెరీర్ ప్రారంభించి.. నేడు ఈ స్థాయికి ఎదిగి.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు సుధీర్. జీవితంలో ఎంతో ఎత్తుకి ఎదిగినా.. చాలా నిరాడంబరంగా ఉండే సుధీర్ తత్వం ఎందరినో తనకు అభిమానులను చేసింది.
ఇక మే 19 సుధీర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈటీవీలో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో అయ్యగారే నంబర్ 1 అంటూ సుధీర్ మీద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్‌కు సన్మానం చేయడం వంటి ఫన్నీ స్కిట్‌లు చేశారు. ఇక సుధీర్ రియల్ లైఫ్‌లో చోటు చేసుకున్న లవ్ బ్రేకప్‌పై రాజు డ్యాన్స్ పర్‌ఫామెన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. సుధీర్ రియల్ లైఫ్‌లో లవ్ బ్రేకప్ అనే సంగతి తెలిసిందే. సుధీర్ లైఫ్‌లో సెటిల్ అయ్యేందుకు హైదరాబాద్ వచ్చాడు. అతడిని ప్రేమించిన యువతి.. ఎదురు చూస్తానని మాట ఇచ్చింది. కానీ కొన్ని రోజులకే మరొకరిని వివాహం చేసుకుంది. అది తెలిసి సుధీర్ ఎంతో కుమిలిపోయాడు. కానీ అదే తల్చుకుని జీవితాన్ని వృథా చేసుకోలేదు. ఆ అమ్మాయి కన్నా కూడా తనను కని పెంచిన తల్లిదండ్రుల ప్రేమ గొప్పదని అర్థం చేసుకుని.. జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగాడు. నాడు తనను కాదనుకున్నవారే నేడు కుళ్లుకునే రేంజ్‌లో విజయం సాధించాడు.
ఇది కూడా చదవండి: Rohini: జబర్దస్త్ కి హైపర్ ఆది గుడ్ బై చెప్పాడా? అసలు నిజం చెప్పిన రోహిణి!
ఈ సంఘటలన్నింటిని డ్యాన్స్ రూపంలో ప్రదర్శించగా.. సుధీర్‌తో పాటు మిగతా వారు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. తాను ఈ రోజు ఈ స్థాయికి ఎదగాడిని పరోక్షంగా ఆ అమ్మాయే కారణమని.. తాను ఎక్కడ ఉన్నా.. హ్యాపీగా ఉండాలని కోరుకున్నాడు. మే 22న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ ప్రోమో చేసిన వారు లవ్ ఫెయిలయ్యిందని.. అమ్మాయి మోసం చేసిందని.. క్షణికావేశంలో దారుణమైన నిర్ణయాలు తీసుకునే వారికి సుధీర్ అన్న జీవితం బెస్ట్ ఎగ్జామ్‌పుల్.. అన్నను స్ఫూర్తిగా తీసుకుని.. కాదన్న వారి ముందే కాలర్ ఎగరేసుకుని తిరిగేస్థాయికి చేరుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం!