‘సుడిగాలి సుధీర్’ బుల్లితెర స్టార్ అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ అనే ఒక కామెడీ షోతో ఎంట్రీ ఇచ్చి.. కమీడియన్ గా, మెజీషన్ గా, యాంకర్, డ్యాన్సర్ గా తనని తాను నిరూపించుకున్నాడు. తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. టాలీవుడ్ లో సైడ్ రోల్స్ తో మొదలు పెట్టి ఇప్పుడు ఫుల్ లెంగ్త్ హీరోగా మారిపోయాడు. ఇప్పటి దాకా అంతా బానే ఉంది కానీ.. ఈ మధ్య పరిస్థితులు చాలా మారిపోయినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ నిర్వాహకులకు- సుడిగాలి సుధీర్ కు మధ్య విభేదాలు, వివాదాలు అంటూ వార్తలు వస్తున్నాయి.
#sudigalisudheer waiting for this style……… #ValimaiTrailer support pic.twitter.com/RHRmBSiHtk
— SUDHEER SOLDIERS (@Sudheer78631892) December 30, 2021
ఇప్పటికే ఢీ షో నుంచి తప్పుకున్న సుధీర్.. తాజాగా లేటెస్ట్ పండగ స్పెషల్ ప్రోగ్రామ్ ‘అమ్మమ్మ గారి ఊరు’ షోలోనూ కనిపించడం లేదు. ఎప్పుడూ పండగ ఈవెంట్ అంటే సుడిగాలి సుధీర్ ఉండాల్సిందే. ఈసారి మాత్రం ఆ లెక్క తప్పింది. రష్మీ, ఆటో రాంప్రసాద్, వర్ష, ఇమ్మాన్యుయేల్ వంటి వారంతా ఉన్నా కూడా సుధీర్ లేని వెలితి తెలుస్తోంది అంటూ అతని అభిమానులు యూట్యూబ్ లో కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. నిజంగానే సుధీర్- నిర్వాహకులకు చెడిందా? లేక వెండితెరపై కాన్సన్ ట్రేట్ చేసేందుకు బుల్లితెరను దూరంపెడుతున్నాడా? అనే దానిపై క్లారిటీ లేదు.
బుల్లితెర వర్గాల్లో మాత్రం వారి మధ్య ఏదో జరుగుతోంది అనే టాక్ వినిపిస్తోంది. ఆ విషయంపై సుడిగాలి సుధీర్ స్వయంగా క్లారిటీ ఇస్తే ఇంకా బావుంటుంది అని చాలా మంది కోరుకుంటున్నారు. అప్పటి వరకు సుధీర్ కు ఉన్న అభిమానులు యూట్యూబ్ లో కామెంట్స్ వార్ మాత్రం ఆపేలా లేరు. సుడిగాలి సుధీర్ పై కుట్ర జరుగుతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Teaser of #SudigaliSudheer‘s #Gaaloduhttps://t.co/Rzckefxorp pic.twitter.com/vfK4Z4H4mN
— Suresh Kondi (@SureshKondi_) December 31, 2021