ఏ పండగ వస్తున్నా స్పెషల్ ఈవెంట్స్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుండటం తెలిసిందే. తాజాగా స్టార్ మా కూడా హోలీ సందర్భంగా ‘ఈ హోలీకి తగ్గేదేలే’ అంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. అయితే మాటీవీ ప్రేక్షకుల కోసం పెద్ద సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. మొదటిసారి సుధీర్ మాటీవీలో కనిపించబోతున్నాడు. అది కూడా రష్మీ జంటగా.. ఇంకేముంది సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ ఆర్మీ రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఈ షోలో మరోసారి సుధీర్ రష్మీ కోసం ‘జాబిల్లి కోసం ఆకాశ మల్లి’ పాట పాడాడు. ఆ పాటకు రష్మీ ఎంతో ఎమోషనల్ అయ్యింది. భావోద్వేగానికి గురవ్వడమే కాకుండా తన కళ్లకు పెట్టుకున్న కాటుక తీసి సుధీర్ కు దిష్టి చుక్క పెట్టింది. ‘నువ్వు నీ కెరీర్ బాగుండాలి’ అంటూ రష్మీ ఆనంద భాష్పాలు కార్చింది. ఈవెంట్ లో ఇంక యాంకర్ రవి తన కుమార్తెతో కలిసి డాన్స్ చేయడం కూడా ఆకట్టుకుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే ఈ మధ్య చాలా కాలంగా దూరంగా ఉన్న యాంకర్ రష్మీ- సుధీర్ మరోసారి ఆనందంగా స్టేజ్ పై కనిపించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ స్టార్ మాలో కొత్త ప్రోగ్రామ్ చేయనున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.