సుడిగాలి సుధీర్.. చాలా కష్టపడి పైకెచ్చిన నటుడు. మేజిషియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఇతడు.. ‘జబర్దస్త్’ షోతో చాలా పేరు తెచ్చుకున్నాడు. తన గురించి షో చూసేంత ఫేమ్ సంపాదించాడు. ఓవైపు యాంకరింగ్ కెరీర్ కంటిన్యూ చేస్తూనే, మరోవైపు హీరోగానూ పలు సినిమాలు చేస్తూ వస్తున్నారు. సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాలోడు’.. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. గత సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమా వసూళ్ల పరంగా సుధీర్ కి సరికొత్త ఎనర్జీ ఇస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఓ విషయం మాత్రం సుధీర్ డెడికేషన్ ఏంటో చెప్పకనే చెప్పేస్తుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అది ఏ సినిమా అయినా కావొచ్చు చూడటానికి చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. రెండున్నర గంటల్లో చూసేయొచ్చు. హిట్ ప్లాఫ్ అనే టాక్ కూడా మార్నింగ్ షో పడగానే వచ్చేస్తుంది. ఇదంతా పక్కనబెడితే ఓ సినిమా వెనక చాలా కష్టం ఉంటుంది. సదరు హీరోహీరోయిన్లు, టెక్నీషియన్లు చెబితే గానీ ఆ విషయాలు బయటకు రావు. వాటి గురించి చెబుతున్నప్పుడు వాళ్లు పడిన కష్టం ఏంటనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు సుడిగాలి సుధీర్ కూడా అలాంటి ఓ భయంకరమైన నిజాన్ని బయటపెట్టాడు.
‘గాలోడు’ సినిమాలోని ‘నీ కళ్లే దీవాలి’ పాట షూటింగ్ కోసం లద్దాఖ్ వెళ్లామని సుధీర్.. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. భూమి కంటే 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న పాంగ్యాంగ్ లేక్ దగ్గర షూట్ కోసం వెళ్లామని అన్నాడు. అయితే అక్కడ చాలా చల్లగా ఉంటుందని తెలిసి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా తీసుకెళ్లామని చెప్పాడు. ఇక మూవీ టీంలో కొందరు బ్రీతింగ్ విషయంలో ఇబ్బందిగా అనిపించడంతో పూర్తిగా పైవరకు రాలేకపోయారని సుధీర్ చెప్పాడు. హీరోయిన్ తల్లికూడా అలానే సగం ఎత్తుకు వెళ్లగానే ఇబ్బంది పడ్డారని సుధీర్ చెప్పాడు. ప్రాబ్లమ్ అనిపించినా సరే అమ్మాయి కోసం పైవరకు వస్తానని అన్నారని చెప్పాడు.
ఇక తొలిరోజు చాలా ఇబ్బందిపడుతూనే అక్కడ ఉండిపోయామని చెప్పిన సుధీర్.. ఉదయం లేవగానే వెళ్లిపోవాలని అనుకున్నామని చెప్పాడు. కానీ నిర్మాత డబ్బులు వృథా చేయడం ఇష్టం లేక షూటింగ్ కంప్లీట్ చేశామని చెప్పాడు. అయితే అక్కడ మైనస్ 20, 30 డిగ్రీల చల్లగా ఉంటుందని, ఊపిరి పీల్చుతున్నా సరే మంచు లోపలికి వెళ్తుందని అన్నాడు. కాలు తీసి కాలు వేయలేక చాలా ఇబ్బందులు అనుభవించామని సుధీర్ చెప్పాడు. అయితే స్టెప్స్ వేసినప్పుడు, ప్రతి షాట్ తర్వాత తన ముక్కు నుంచి రక్తం కారేదని.. దాన్ని తుడుచుకుని షూటింగ్ పూర్తి చేశామని అన్నాడు. ఈ మొత్తం విన్న ‘గాలోడు’ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. అతడి డెడికేషన్ చూసి ముచ్చట పడుతున్నారు. మరి సుధీర్ చెప్పిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.