సుడిగాలి సుధీర్.. బుల్లితెర లోనే కాకుండా వెండితెరపై కూడా తన సత్తా నిరూపించుకున్నాడు. సుధీర్‌కు ఓ హీరోకి ఉన్న క్రేజ్ ఉంది అనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సుధీర్ పేరు మారుమ్రోగుతూ ఉంటుంది. ఇటీవల సుధీర్ జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో హైపర్ ఆది చేసిన కామెంట్స్ పై సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ షోలో లేకపోయినా ఆది అతనిపై పంచులు వేస్తుండటంతో ఫైర్ అవుతున్నారు.
విషయం ఏంటంటే.. తాజాగా విడుదలైన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో హైపర్ ఆది సుడిగాలి సుధీర్, రష్మీ జోడీపై పంచుల వర్షం కురిపించాడు. ప్రేమకావాలి హీరోయిన్ ఇషా చావ్లా షోకి రాగా.. ప్రేమ కావాలి సినిమా నుంచి ఇషానే ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత ‘కొన్ని డైలాగులు ఉంటాయి కదా.. అవి చెప్పడం నాకు రాదు. చచ్చిపోతే ఏడుస్తారు, గొయ్యి తీసిపూడుస్తారు. రాత్రి 11 గంటలకు ఫోన్ చేశాడు, 12 గంటలకు గోడ దూకాడు ఇవి కూడా నాకు తెలియవు.’ అంటూ వరుస పంచులతో రెచ్చిపోయాడు.
ఆ తర్వాత ఇషాకు సుధీర్ స్టైల్ లో గిఫ్టులు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఇమ్మాన్యూయేల్ కలగజేసుకుని.. వాళ్లకు దిష్టి తగులుతుంది అన్నాడు. అందుకు ఆది స్పందిస్తూ.. ‘దిష్టి జోడీ గురించి.. ముష్టి జోడీ మాట్లాడుతోంది’ అంటూ కామెంట్ చేశాడు. అలా సుధీర్- రష్మీ జోడీని ఫుల్ రోస్ట్ చేయడంతో సుధీర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షోలో లేకపోయినా సుధీర్ పై పంచులు వేయడం అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. సుధీర్ పై పంచులు వేస్తుంటే రష్మీ కూడా అటు నవ్వలేక.. ఇటు కోప్పడలేక చూస్తూ ఉండిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆది పంచులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.