సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. మేజిషియన్ గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు బుల్లితెరపై యాంకర్ గా, సినిమాల్లో కూడా రాణిస్తున్నాడు. ఎన్నో కష్టాలు దాటుకుని ఈ స్థానం చేరుకున్న సుధీర్ కు అభిమానులు కూడా ఎక్కువే. ఇక బుల్లితెర మీద సుధీర్-రష్మి జంటకున్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పటికే పలు ఈవెంట్‌లో సుధీర్-రష్మిల ఫేక్ ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అది అబద్ధమైన వారి ఫ్యాన్స్‌కు మాత్రం కనువిందు చేసింది. దీంతో బుల్లితెరపై లవ్లీ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు.
ఇది కూడా చదవండి : సుడిగాలి సుధీర్ పై దారుణమైన ట్రోల్స్! ఫ్యాన్స్ ఫైర్!
ఈ క్రమంలో తాజాగా మరోసారి సుధీర్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోమోలో సుధీర్ ఎంగేజ్‌మెంట్ అంటూ ఓ వీడియోని బయటకు వదిలారు. ఇది కాస్తా ప్రస్తుతం నెట్టంట హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి ఇది నిజమైన నిశ్చితార్థమా? లేక ఎప్పటిలాగే ఫేకా.. అంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అయితే ఈసారి సుధీర్ ఎంగేజ్‌మెంట్ పరిశ్రమకు సంబంధం లేని అమ్మాయితో జరగడం, ఉంగరాలు కూడా మార్చుకోవడంతో ఇది నిజమే అంటున్నారు ఎక్కువ మంది అభిమానులు. ఇక సుధీర్ పక్కన ఉన్న ఆ అమ్మాయి ఎవరనే దాని గురించి ఆరా తీస్తున్నారు. మరీ ఇంతకు సుధీర్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఆ అమ్మాయి ఎవరు.. ఆమె వివరాలు..
ఇది కూడా చదవండి : సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
సుధీర్ పక్కన కనిపిస్తున్న ఈ అమ్మయి పేరు తేజస్వీ నాయుడు. ఈమె ఒక మోడల్. చూడగానే ఆకట్టుకునే చిరునవ్వుతో.. ప్రేక్షకులను ఆకర్షించే రూపం ఆమె సొంతం. ఇక ఇప్పటికే తేజస్వీ పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది. రీసెంట్ గా ఆహా లో వచ్చిన సామజవరగమన అనే సిరీస్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఆమె పాపులారిటిని ఉపయోగించుకోవాలి అనుకున్న సదురు టీవీ యాజమాన్యం..తనతో ఓ షో ని ఇలా ప్లాన్ చేశారంటున్నారు నెటిజన్స్.
ఇది కూడా చదవండి : సుడిగాలి సుధీర్ పెళ్లి.. వీడియో వైరల్!
ఇక తేజస్వీ మోడల్ గా కూడా కొన్ని యాడ్ షూట్స్ చేసింది. కానీ ఆమె ఇండస్ట్రీలో పెద్దగా ఎవరికి తెలియదు. అడపడదడపా యాడ్స్‌లో నటిస్తున్న ఆమె సుధీర్‌తో ఎంగేజ్‌మెంట్ వీడియోతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. సుధీర్ తో ఎంగేజ్‌మెంట్ అయినట్టుగా వీడియో బయటికి వచ్చిన తర్వాత ఆమె ఎవరు.. తన బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. అని అభిమానులు గూగుల్ లో తెగ సర్చ్ చేస్తున్నారట. మొత్తానికి మరోసారి కూడా సుధీర్ ఎంగేజ్‌మెంట్ ఫేకే అని తేలింది అంటున్నారు నెటిజనులు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.