సుడిగాలి సుధీర్.. కమీడియన్ గా, యాంకర్, డాన్సర్, మెజీషియన్, సింగర్, హీరోగా బుల్లితెర నుంచి వెండితెర దాకా అందరికీ సుపరిచితుడే. జబర్దస్త్ వెలుగులోకి వచ్చిన సుధీర్ అక్కడి నుంచి ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం అటు టీవీ షోస్‌తో పాటుగా.. హీరోగా కూడా ఫుల్ బిజీ అయిపోయాడు. సుధీర్ అనగానే గుర్తొచ్చేది పెళ్లి. ఇప్పటికే టీవీ షోల కోసం 6సార్లు దాకా పెళ్లి చేసుకున్న సుధీర్.. రియల్ లైఫ్ లో ఎప్పుడు చేసుకుంటాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుధీర్ పెళ్లెప్పుడు అని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
ఇదీ చదవండి: వీడియో: తన మనసులో ఉన్న వ్యక్తి ఎవరో బయటపెట్టిన శ్రీముఖి!
అయితే అభిమానుల ఎదురుచూపులకు తెర పడిందనే టాక్ వినిపిస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ‘మా నాన్నకు పెళ్లి’అనే స్పెషల్ ఎపిసోడ్ చేశారు. అందులో బుల్లెట్ భాస్కర్ తండ్రికి మళ్లీ పెళ్లి చేస్తున్నట్లు చూపించారు. అయితే ప్రోమో చివర్లో మాత్రం బుల్లెట్ భాస్కర్ తండ్రి.. సుధీర్ ను ఓ ప్రశ్న అడిగారు ‘మీ నాన్న గారిని కలిశాను.. మా వాడు టీవీలోనే పెళ్లి చేసుకుంటున్నాడు. బయట ఎప్పుడు చేసుకుంటాడో అని అంటున్నారు’ అని చెప్పుకొచ్చాడు. అందుకు సుధీర్ ఇంత మంది ఫాదర్స్ అడుగుతున్నారు కాబట్టి.. అంటూ స్టేజ్ దిగి వెళ్తాడు. అందరూ ఎవరినీ తీసుకొస్తాడో అని ఆతురతగా ఎదురుచూశారు. ప్రోమో అయిపోయింది. మరి ఇప్పటికైనా ఆ అమ్మాయి ఎవరో చూపిస్తాడా? లేక మళ్లీ ఇది టీఆర్పీ స్టంట్ అని సరిపెడతారో చూడాలి. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.