సుడిగాలి సుధీర్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం అక్కర్లేని పేరిది. తనదైన టాలెంట్ తో అటు టీవీ షోలలోనూ, సినిమాల్లోనూ సత్తా చూటుతున్నాడు. ఇక సుధీర్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. సినిమాలో ఒక స్టార్ హీరోని ఫ్యాన్స్ ఎలా అభిమానిస్తారో, బుల్లితెరపై సుధీర్ ని కూడా అంతలా ఆరాధించేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే..ప్రత్యేకించి సుధీర్ కి ఎంతటి క్రేజ్ ఉందొ, సుధీర్-రష్మీ జోడీకి కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరిని అన్న,వదిన అంటూ పిలుచుకుంటూ మురిసిపోయే అభిమానులు కూడా ఉన్నారు. వ్యక్తిగతంగా కూడా వీరిద్దరి మధ్య అంతే బాండింగ్ కూడా ఉంది. అయితే.. తాజాగా సుధీర్ ఫ్యాన్స్ రష్మీపై మండిపడుతున్నారు. మరి.. రష్మీపై ఒక్క మాట కూడా పడనివ్వని సుధీర్ ఫ్యాన్స్.. ఏకంగా ఆమెనే ఎందుకు టార్గెట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ గురువారం సుధీర్ పుట్టిన రోజు. చాలామంది సుధీర్ కి ర్త్ డే విషెష్ తెలిపారు. ఇక ఆయన అభిమానులు అయితే. సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. కేక్స్ కట్ చేస్తూ.. సుధీర్ అన్న తోపు, దమ్ముంటే ఆపు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా.. సుధీర్ కి రష్మీ మాత్రం బర్త్ డే విషెస్ చెప్పలేదు. ఎప్పుడు సుధీర్ వెంటే ఉంటూ.. అతనిపై ఎనలేని ప్రేమని చూపించే రష్మీ నుండి కనీసం విషెష్ కూడా రాకపోవడంతో సుధీర్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. నిజానికి రష్మీ సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. తనకి సంబంధించిన అన్నీ విషయాలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేస్తూ ఉంటుంది.
ఇదీ చదవండి:లక్కీ ఛాన్స్ కొట్టేసిన విశ్వక్ సేన్! గుడ్ న్యూస్ చెప్పేసిన హీరో అర్జున్
ఈ గురువారం కూడా రష్మీ ఫేస్ బుక్ లో తన పిక్ ని పోస్ట్ చేసింది. సో.. కావాల్సినంత సమయం ఉన్నా రష్మీ.. కావాలనే సుధీర్ కి బర్త్ విషెస్ చెప్పలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. నిజానికి సుధీర్ ఫ్యాన్స్ అంతా రష్మీని గౌరవిస్తూ ఉంటారు. తమ మనిషే అనుకున్న రష్మీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడమే వారి బాధకి కారణంగా తెలుస్తోంది.ఇక జబర్దస్త్ షోలో ఈ జంట ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. రష్మి, సుధీర్ మధ్య లవ్ స్టోరీ నిజం కాకపోయినా, అది నిజం కాదని తెలిసినా ఫ్యాన్స్ మాత్రం వీరిని వేరువేరుగా చూడటానికి ఇష్టపడటం లేదు. ఈనాటికీ వీరిద్దరూ వివాహం చేసుకోవాలి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూనే ఉంటారు. మరి.. సుడిగాలి సుధీర్ సక్సెస్ సగ భాగమైన రష్మీ.. సుధీర్ కి బర్త్ డే విషెష్ తెలపకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.