తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ జోడీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పంచ్ డైలాగ్ లతో నవ్విస్తూనే విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇక దీనితో అగకుండా లవ్ ట్రాక్ తో బుల్లితెర ప్రేక్షకులను ఓ మాదిరిగా అక్కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేక్షకుల నాడిని పసిగట్టి టిఆర్పి రేటింగ్ పెంచుకొవటం కోసం చేయని ప్రయత్నం అంటూ లేదనే చెప్పాలి. టాస్క్ లో భాగంగా ఈ జోడీలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టు సాగే ఈ రియాలిటీ షోలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటున్నాయి. దీంతో పాటు టిఆర్పి రేటింగ్ లో కూడా అగ్రభాగానికి దూసుకెళ్తున్నాయి ప్రముఖ బుల్లితెర ఛానెల్స్.
తెలుగులో ప్రసారమయ్యే రియాలిటీ, కామెడీ షోలు శర వేగంగా దూసుకెళ్తున్నాయి. ఇక ఇందులో కొన్ని జోడీలు మాత్రం బాగా ఆదరణ పొందాయి. వారిలో సుధీర్ రష్మి జంట, దీంతో పాటు వర్ష ఇమ్మాన్యుయేల్, అనసూయ అది వంటి జంటలు బాగా క్లిక్ అయ్యాయనే చెప్పాలి. బాగా క్లిక్ అయినా జంట అంటే సుధీర్, రష్మీ అనే చెప్పాలి. ఇక తాజాగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ప్రోమో ఒకటి విడుదలై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.
ఇందులో రష్మి ఇలా అడుగుతూ.. సుధీర్….ఒకవేళ నేను ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి అని అడుగుతుంది. దీంతో వెంటనే సుధీర్ నీకోసం వెయ్యి జన్మలు మరణించైనా సరే. ఒక్కసారి జన్మించటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ సమాధానం ఇస్తాడు. దీంతో రష్మి వెంటనే సిగ్గుపడుతూ నవ్వుతుంది. ఇదే ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.