డార్లింగ్ ప్రభాస్.. పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో, ఎంత ఫాలోయింగ్ ఉందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-K వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. బుధవారం ప్రభాస్ సీతా రామం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తళుక్కుమన్న విషయం తెలిసిందే. ఇంత బిజీ షెడ్యూల్ లోనూ అశ్వినీ దత్ మీదున్న అభిమానం, గౌరవంతో సీతా రామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ అతిథిగా వచ్చాడు.
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈ వెంట్ కి ప్రభాస్ క్యాప్, కళ్లజోడుతో వచ్చాడు. ఎక్కడా ఆ క్యాప్ తీయలేదు. తన పూర్తి ముఖాన్ని ఎవరికీ చూపించలేదు. చాలా మంది అది ఒక స్టైల్ లుక్ అనుకుంటున్నారు. కానీ, అలా రావడం వెనుక పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు. అదేంటంటే.. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో బాగా బిజీగా ఉన్నాడు. 2023 జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే ఆ సినిమాకి సంబంధించి ఇప్పటికీ ప్రభాస్ లుక్ ఏమీ బయటకు రాలేదు. అలాంటిది ఇప్పుడు లాంగ్ హెయిర్‌తో వస్తే ఆ లుక్ రివీల్ చేసినట్లు అవుతుందనే భావనతోనే ప్రభాస్ అలా క్యాప్ తో ముఖాన్ని దాచుకున్నాడని చెబుతున్నారు. అలాంటప్పుడు రాకుండా ఉంటే సరిపోతుంది కదా? అనే ప్రశ్న రావచ్చు. పాన్ ఇండియా స్థాయిలో అంత గుర్తింపు, ఫ్యాన్ బేస్ తెచ్చుకున్నా కూడా ప్రభాస్ తెలుగు మూలాలను మర్చిపోలేదు. అందుకే అశ్వినీ దత్ కోసం ఈవెంట్ వచ్చాడని చెబుతున్నారు. ప్రభాస్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.