అమర్‌దీప్-తేజస్విని అంటే ఓ నెలరోజుల క్రితం వరకు తెలుగు సీరియల్స్‌లో నటించేవారిగా మాత్రమే తెలుసు. కానీ ఓ రోజు సడెన్‌గా వీరిద్దరూ తమ నిశ్చితార్థం వీడియో, ఫోటోలు రిలీజ్ చేసి.. అందరికి షాక్ ఇచ్చారు. అసలు వీరిద్దరి మధ్య లవ్ ఎలా అబ్బా.. కనీసం ఇద్దరు కలిసి ఇంత వరకు ఒక్క సీరియల్‌లో కూడా నటించలేదు కదా.. మరి ఇది ఎలా సాధ్యం అనుకున్నారు. ఎంత సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపారని ఆశ్చర్యపోయారు. ఫైనల్‌గా పెళ్లి పీటలు ఎక్కబోతున్నందకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఆ సంగతి వదిలిస్తే.. తాజాగా అమర్‌దీప్.. కాబోయే భార్య, అత్త చేత.. అందరి ముందు స్టేజీ మీద కంట తడి పెట్టించాడు. అమర్‌దీప్ కాబోయే భార్యకిచ్చిన సర్‌ఫ్రైజ్ గిఫ్ట్ చేసి.. తేజస్వినితో పాటు.. స్టేజీ మీద ఉన్న ప్రతి ఒక్కరు కంట తడి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
వినాయక చవితి సందర్భంగా అమర్‌దీప్-తేజస్విని ఓ టీవీ చానెల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సందడి చేశాడు. స్పెషల్ పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో వీరి లవ్ స్టోరీ ఎలా ప్రారంభం అయ్యింది.. ఎలా ప్రపోజ్ చేసుకున్నారు వంటి సంఘటనలను స్టేజీ మీద చేసి చూపించారు. ఈ కార్యక్రమానికి తేజస్విని తల్లి కూడా వచ్చారు. ఈ క్రమంలో అమర్‌దీప్.. తేజస్విని నీకు చిన్న సర్‌ప్రైజ్ అంటూ.. కాబోయే భార్య, అత్తగారి కళ్లకు గంతలు కడతాడు. ఆ తర్వాత తేజస్విని తండ్రి మైనపు విగ్రహాన్ని స్టేజీ మీదకు తీసుకువచ్చి.. ఆ తర్వాత గంతలు విప్పుతారు.
అది చూసి తేజస్విని, ఆమె తల్లి చాలా ఎమోషనల్ అవుతారు. తేజస్విని తండ్రి చాలా ఏళ్ల క్రితమే మృతి చెందాడు. దాంతో అమర్‌దీప్ ఇలా ఆమె తండ్రి మైనపు విగ్రహాన్ని చేయించి.. జీవితంలో మర్చిపోలేని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇది చూసి తేజస్విని, అమర్‌దీప్‌లతో పాటు స్టేజీ మీద ఉన్న ప్రతి ఒక్కరు భావోద్వేగానికి గురయ్యి ఏడ్చారు. ఇక తేజస్విని తల్లి.. భర్త ప్రేమతో పాటు తండ్రి ప్రేమను పంచే వ్యక్తి నా కుమార్తెకి భర్తగా దొరికాడు. తనంటే నీకు ఎంత ప్రేమో నిరూపించుకున్నావు.. లవ్ యూ నాన్న.. అంటే అమర్‌దీప్.. అందుకు లవ్యూ అమ్మ అని అన్నాడు. ఆ తర్వాత స్టేజీ మీద ఈ జంటకు మరోసారి నిశ్చితార్థం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అమర్‌దీప్ చేసిన పనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.