ఈ మధ్య ఓ స్టార్ హీరోయిన్ గురించి సంచలన నిజాలు బయట పడుతున్నాయి. తను ప్రగ్నెంట్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసింది. తాజాగా తన భర్త పేరు రివీల్ చేసింది.
గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేవదాసు చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది. ఈ ముద్దుగుమ్మ మహేష్‌తో నటించిన ‘పోకిరి’ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన నడుము అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తుంది. ఈ మధ్య తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. బేబి బంప్ వీడియో కూడా పోస్ట్ చేసింది. ఆమె ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అందరితో పంచుకుని తన కొడుకు ఫొటోలను కూడా రివీల్ చేసింది. తాజాగా తన ప్రియుడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఇంతవరకు ఇలియానా తన బిడ్డకు తండ్రి ఎవరు అన్న విషయం చెప్పలేదు. అందరు ఇలియానా పెళ్లి కాకుండానే తల్లి అయిందని అనుకుంటున్నారు. ఈ క్రమంలో జూలై నెలలో తన ప్రియుడి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అతనితో ఇలియానాకు ఈ సంవత్సరంలోనే పెళ్లి జరిగిందట. ఆమె భర్త పేరు మైఖేల్ డోలన్ అని చెప్పింది. గత సంవత్సరం నుండి వీరు ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారు. ఈ ఏడాది మే 13న సన్నిహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి.
ఇలియానా తన ప్రగ్నెన్సీ ప్రకటించిన ఈ భామ పెళ్లిని ఎందుకు రహస్యంగా దాచిందో మరి తెలియడం లేదు. తన ప్రగ్నెన్సీని ప్రకటించే దానికి ఒక నెల ముందుగా మ్యారేజ్ చేసుకుందని తెలుస్తుంది. తన భర్త గురించి పేరు తప్ప మరే ఇతర వివరాలను వెల్లడించడానికి ఇష్టపడడంలేదు. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా భర్త వివరాలను మాత్రం సీక్రెట్‌గా ఉంచడం దేనికని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏది ఏమైనా గోవా ముద్దుగుమ్మ తన కుమారునితో, భర్తతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ గడిపేస్తుంది.