సినీ ఇండస్ట్రీలో వివాహ బంధానికి ముగింపు పలికి విడాకుల బాటపడుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. హీరోలు, హీరోయిన్లు మొదలుకొని ఇప్పుడు దర్శకులు కూడా చేరుతున్నారు. దర్శకుడిగా నేషనల్ అవార్డు అందుకున్న స్టార్ డైరెక్టర్ బాలా 17 సంవత్సరాల తర్వాత తన భార్య ముత్తుమలర్ తో విడిపోయిన వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ బాలా అంటే తెలియని సౌత్ ఇండియన్ ప్రేక్షకులు ఉండరు.
ఆయన తీసిన చాలా సినిమాలు నేషనల్ అవార్డులు అందుకున్నాయి. బాలా ఆయన భార్య ముత్తుమలర్.. మార్చి 5న ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. డైరెక్టర్ బాలా, ముత్తుమలర్ ఇద్దరూ కూడా గత నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నారట. ఇద్దరూ కూడా పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారని తమిళ సినీవర్గాలు చెబుతున్నాయి.వీరికి ప్రార్థన అనే కూతురు ఉంది. ఒక్కసారిగా విడాకులు తీసుకున్నారనే వార్త తెలియగానే ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. బాలా, ముత్తుమలర్ ఇద్దరూ 2004లో సాంప్రదాయ వివాహం చేసుకున్నారు. దాదాపు 17 ఏళ్ల పాటు సాగిన వీరి వివాహ బంధానికి విడాకులతో ఫుల్ స్టాప్ పెట్టేశారు. కొన్నేళ్ల క్రితమే బాలా, మలర్ మధ్య విభేదాలు తలెత్తి విడిగా ఉంటున్నారట.
Director Bala his wife Muthumalar got divorced after 17 years of marriage. pic.twitter.com/UxG0BWktRN
— Sreedhar Marati (@SreedharSri4u) March 8, 2022
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కెరీర్ పరంగా దర్శకుడు బాలా.. స్టార్ హీరో సూర్యతో కొత్త సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే.. వ్యక్తిగత జీవితం, విడాకులు నేపథ్యంలో దర్శకుడు ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టలేకపోతున్నాడని చెబుతున్నారు సన్నిహితులు. ఇక బాలా తీసిన సినిమాలలో శివపుత్రుడు, సేతు, వాడు వీడు, పరదేశి, నేనే దేవుడ్ని లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.