ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలతో అభిమానులు అందోళన చెందుతున్నారు. నటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర రంగానికి చెందిన సెలబ్రెటీలు కన్నుమూయడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఈ విషాదం మరువక ముందు పంజాబీ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న దల్జీత్ కౌర్ ఖంగురా కన్నుమూసింది.. నిన్న మాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత బి హరికుమార్ మరణించారు.. ఈ విషాదాలు మరువక ముందే ప్రముఖ రంగస్థల, సినీ నటుడు కన్నుమూశాడు.
పాకిస్థాన్ లోని పంజాబీ ఇండస్ట్రీలో రంగస్థల నటుడు, స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న తారిక్ తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వెంటిలేటర్ కే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన లాహూర్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1976 లో ఫైసలాబాద్ లో జన్మించిన తారీక్ 1990 నుంచి తన కెరీర్‌ను ప్రారంభించాడు. రంగస్థల నటుడిగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి తన మేనరీజంతో.. కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవాడు. 2004 లో రిలీజ్ అయిన ‘సలాఖైన్’చిత్రంతో బాగా పేమస్ అయ్యాడు.
తారీక్ ముఖంపై ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉండేవాడని.. అతని జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మంచి నటుడిగా తన నవ్వులతో అందరి మనసు దోచాడని.. అలాంటిది తారీక్ మరణ వార్త తట్టుకోలేకపోతున్నామని సహ నటులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆయన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Sad to learn about demise of famous stage actor & comedian #TariqTeddy. Condolences to his family & friends. May almighty Allah bless him jannah. Aameen 🤲🏼 pic.twitter.com/0VJfwjCcrL
— Mohammad Hafeez (@MHafeez22) November 19, 2022