చిత్ర పరిశ్రమలో కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా.. ఇంతా.. కాదు. ఒక్కసారి ఓ హీరో, ఓ డైరెక్టర్ కలిసి రికార్డులు తిరగరాశారు అనుకోండి.. తర్వాత ఆ కాంబోలో వచ్చే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొంటాయి. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఇంత వరకు వీరి కాంబో పడలేదు. అయినా కానీ వీరి కాంబో గురించి తెలుగు చిత్ర పరిశ్రమే కాకుండా యావత్ భారత చిత్ర పరిశ్రమ ఎదురు చూస్తుంది. ఆ కాంబో మరెవరో కాదు దర్శకధీరుడు SS రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్ బాబు. వీరి కాంబినేషన్ లో మూవీ వస్తే చూడాలని ప్రేక్షకులు ఎప్పటినుంచో వేచిచూస్తున్నారు. ఈ క్రమంలోనే జక్కన్నఎట్టకేలకు మహేశ్ బాబుతో సినిమా పై క్లారిటీ ఇచ్చాడు. అదీకాక స్టోరీ లైన్ని కూడా లీక్ చేసి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఒకరేమో దర్శకధీరుడు.. మరోకరేమో సూపర్ స్టార్.. మరి వీరిద్దరి కలయికలో చిత్రం అంటే ఒకసారి ఊహించుకోండి? ఈ కాంబో కోసం ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురు చూపులు ఫలించాయి. SSMB28 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా SSMB29 చిత్రం తెరకెక్కనున్నట్లు జక్కన్న వెల్లడించారు. తాజాగా అమెరికాలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్ కు డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు. ఈ క్రమంలోనే అక్కడి మీడియా నుంచి జక్కన్నకు ఓ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే? హీరో మహేశ్, మీ కాంబో లో మూవీ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? అని. ఇక ఈ ప్రశ్నకు జక్కన్న బదులిస్తూ..”ప్రిన్స్ తో నేను తియ్యబోయే చిత్రం ఫుల్ యాక్షన్ అడ్వెంచర్.. గ్లోబ్ ట్రాటింగ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణం చేయడం. ఈ మూవీలో మహేశ్ జేమ్స్ బాండ్ కు ఏమాత్రం తీసిపోడని” తెలిపాడు.
అదీ కాక అభిమానులు సైతం ప్రిన్స్ ను జేమ్స్ బాండ్ పాత్రలోనే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారన్నాడు. ఈ విషయాన్ని గతంలో పలు మార్లు జక్కన్న చెప్పకనే చెప్పాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. గతంలో కథారచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ స్టోరీ ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని తెలిపారు. ఇప్పుడు జక్కన్న ఏకంగా స్టోరీ లైన్ చెప్పి ప్రేక్షకులను సర్ప్రైజ్ కు గురిచేశాడు. జక్కన్న టేకింగ్ కు మహేశ్ నటన తోడైతే ఎలా ఉంటుందో ఉహించుకుంటేనే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఈ నేపథ్యంలో జక్కన్న ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వడం నిజంగా అభిమానులు పండుగనే చెప్పాలి.
ప్రస్తుతం మహేశ్.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో SSMB28 చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ ను కూడా మెుదలు పెట్టినట్లు చిత్ర యూనిట్ నిన్న వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఇక ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిన వెంటనే జక్కన్న షూటింగ్ స్టార్ట్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంవత్సరం జనవరి 26 న మహేశ్-జక్కన్నల చిత్రం ప్రారంభం అవుతుందని బొగట్ట. అదీ కాక ప్రస్తుతం ప్రిన్స్ పలు బుల్లితెర షోలల్లో కూతురు సితారతో కలిసి సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి జక్కన్న-ప్రిన్స్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🚨An ELECTRIFYING update about the most anticipated film! ⚡🤩
Sensational Backdrop for #SSMB29 🔥🔥, revealed by the Maverick Director #SSRajamouli himself!! 💥💥“A Globetrotting Action Adventure”🌪 loading…. just BRACE yourselves ❤️🔥#MaheshBabu @urstrulyMahesh @ssrajamouli pic.twitter.com/T3O0RyL1Oz
— Telugu FilmNagar (@telugufilmnagar) September 13, 2022