దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి మరోసారి ప్రపంచాన్ని తన మ్యాజిక్ తో ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్-తారక్- రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ‘RRR’ మార్చి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా జనవరి 7న విడుదల కావాల్సిన సినిమా వాయిదాలు పడుతూ మార్చి 25కు చేరింది. ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, డైలాగ్, సాంగ్, గ్లింప్స్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటి అభిమానులను ఉర్రూతలూగించాయి. యూట్యూబ్ మొత్తాన్ని షేక్ చేశాయి.
వాటిలో ‘దోస్తీ’ అనే పాట ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలుసు. ఆ పాటకు సంబంధించిన క్రేజీ విషయాన్ని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అనిరుధ్- రాజమౌళి మధ్య అద్భుతమైన అనుబంధం ఉందని జక్కన్న మాటల్లో అర్థమైంది. రాజమౌళి అడిగిన వెంటనే అనిరుధ్ ఏ మాత్రం ఆలోచించకుండా పాట పాడేందుకు ఒప్పుకున్నాడు. మొత్తం ఐదు భాషల్లో అనిరుధ్ ఆ పాట పాడాడు.. నటించాడు కూడా. కానీ, అందుకు సంబంధించి రెమ్యూనరేషన్ గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేందంట. ఈ మాటను రాజమౌళీనే స్వయంగా చెప్పారు. ఆ వీడియో మీరూ చూసేయండి.
I like his voice among those 5 languages & Anirudh didn’t take any Remuneration for #Natpu song – @ssrajamouli @anirudhofficial♥️ #Anirudh#NTR30 pic.twitter.com/AvXREjDgOs
— Anirudh Trends (@AnirudhTrendss) February 2, 2022