సెలబ్రిటీలని అభిమానించే వారు చాలామంది ఉంటారు. సదరు సెలబ్రిటీలని వాళ్లు కలిసినా, సెల్ఫీలు తీసుకున్నా సరే ఫ్యాన్ బాయ్ లేదా ఫ్యాన్ గర్ల్ మూమెంట్ పేరుతో సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు. తమ స్టేటస్ నే ఒకటి పదిసార్లు చూసి తెగ మురిసిపోతుంటారు. అయితే కొన్నిసార్లు సెలబ్రిటీలు కూడా తమకిష్టమైన వ్యక్తుల్ని కలిసినప్పుడు చిన్నపిల్లల్లా మారిపోతారు. తెగ సంబరపడిపోతారు. ఇప్పుడు ఇలాంటిదే స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి విషయంలో జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా పోస్ట్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’ అద్భుతం చేసింది. ‘నాటు నాటు’ పాట్.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు డైరెక్టర్ రాజమౌళితోపాటు సంగీత దర్శకుడు కీరవాణి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ సతీసమేతంగా వెళ్లారు. ఇక ఈ ఈవెంట్ తర్వాత ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉన్న రాజమౌళి.. ఇండియానా జోన్స్, జురాసిక్ పార్క్ లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ స్పీల్ బర్గ్ ని కలిశాడు. ఈ సందర్భంగా స్పీల్ బర్గ్.. రాజమౌళి, కీరవాణిలతో ముచ్చటించారు కూడా.
ఇక స్పీల్ బర్గ్ తో తీసుకున్న ఫొటోని షేర్ చేసిన రాజమౌళి.. ‘ఇప్పుడే దేవుడిని కలిశాను’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ఫొటోల్లోని ఒకదానిలో స్పీల్ బర్గ్ ని చూసిన ఆనందంలో రాజమౌళి.. తన రెండు చేతులని చెంపలకు పెట్టుకుని చిన్నపిల్లాడిలా మారిపోయారు. ఆయన ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే.. జక్కన్న ఎంత సంతోషంగా ఉన్నాడో అర్థమవుతోంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫొటోలపై నెటిజన్స్ తోపాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ‘ముగ్గురు దేవుళ్లు ఒకేచోట కలిశారు’ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ‘ఓ పర్వతం ఆకాశాన్ని తాకితే ఇలాగే ఉంటుంది’ అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. మరి రాజమౌళి ఫ్యాన్ బాయ్ మూమెంట్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
I just met GOD!!! ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/NYsNgbS8Fw
— rajamouli ss (@ssrajamouli) January 14, 2023