ఎప్పుడూ కచ్చితమైన విజన్ తో ముందుకు వెళ్లే జక్కన్న.. ఈసారి కూడా తన విజన్ తో ముందుకెళ్లి ఆస్కార్ ను ఒడిసిపట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం రాజమౌళి ఆస్కార్ ప్రమోషన్స్ కు ఖర్చు పెట్టిన ప్రతీ పైసా రాబట్టే పనిలో ఉన్నాడు. మరి అన్ని కోట్లు రాజమౌళి ఎలా రాబట్టాలని చూస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ss రాజమౌళి.. ఓటమి ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్ లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్ కు ఆస్కార్ రావడంతో.. ఒక్కసారిగా జక్కన్న క్రేజ్ హాలీవుడ్ లో మారుమ్రోగిపోయింది. ఎప్పుడూ కచ్చితమైన విజన్ తో ముందుకు వెళ్లే జక్కన్న.. ఈసారి కూడా తన విజన్ తో ముందుకెళ్లి ఆస్కార్ ను ఒడిసిపట్టుకున్నాడు. ఇకపోతే.. రాజమౌళిలో అందరికి ఓ స్టార్ డైరెక్టర్ మాత్రమే కనిపిస్తాడు. కానీ చాలా మందికి తెయని విషయం ఏంటంటే, ఆయనలో ఓ బిజినెస్ మెన్ కూడా ఉన్నాడని. అవును జక్కన్నలో ఓ క్రియేటీవ్ డైరెక్టరే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్త కూడా ఉన్నాడు. ప్రస్తుతం రాజమౌళి ఆస్కార్ ప్రమోషన్లకు అయిన ఖర్చును రాబట్టే పనిలో ఉన్నాడు. మరి జక్కన్నలో ఉన్న ఆ బిజినెస్ మెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్ఎస్ రాజమౌళి.. వంద కోట్లు కొట్టడానికి ఆపసోపాలు పడుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీని వందల కోట్లు కొల్లగొట్టే స్థాయికి తీసుకెళ్లాడు దర్శకధీరుడు జక్కన్న. తొలి చిత్రం నుంచి విజయవంతమైన చిత్రాలనే తెరకెక్కిస్తూ వచ్చిన రాజమౌళి.. ఓటమి ఎరుగని డైరెక్టర్ గా టాలీవుడ్ లో రికార్డు సృష్టించాడు. ఇక కెరీర్ తొలి నాళ్లలో సినిమాకు ఇంత అని రెమ్యూనరేషన్ తిసుకున్న జక్కన్న.. రాను రాను తన ఆలోచనను మార్చుకున్నాడు. సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా మూవీలో షేర్ ను తీసుకోవడం ప్రారంభించాడు దర్శకధీరుడు. మెుదటి నుంచి రాజమౌళి ఓ వ్యాపారవేత్త ఆలోచనలతోనే ముందుకు వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే తనలో ఉన్న అసలైన బిజినెస్ మెన్ ను ఆస్కార్ అవార్డు ప్రమోషన్లలో పరిచయం చేశాడు. ఈ విషయాన్ని చాలా తక్కువ మందే గమనించి ఉంటారు.
ఇక ఆస్కార్ బరిలో నాటు నాటు సాంగ్ నిలిచిన దగ్గర నుంచి జక్కన్న ఓ ప్లాన్ ప్రకారం తన మకాంను హాలీవుడ్ కు మార్చాడు. అదీకాక అందరు చెప్పుకుంటున్నట్లుగా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం పెట్టిన రూ. 80 కోట్లను స్వయంగా రాజమౌళినే ఖర్చు పెట్టుకున్నాడు. అయితే ఏం లాభం ఆశించకుండా అంత మెుత్తంలో ఎవరూ ఖర్చు పెట్టరు అన్నది కాదనలేని వాస్తవం. మరి ఇంత మెుత్తంలో ఆస్కార్ ప్రమోషన్స్ కోసం జక్కన్న ఎందుకు ఖర్చుపెట్టారు అనుకుంటున్నారా? దానికి కొన్ని కారణాలు ఉన్నాయని, ఈ ప్రమోషన్స్ ను ఈ రేంజ్ లో చేయడానికి వెనక రాజమౌళి పెద్ద స్కెచే వేశాడని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇంతకీ ఆ మాస్టర్ స్కెచ్ ఏంటంటే? రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ ఆస్కార్ తో జక్కన్న క్రేజ్ వరల్డ్ వైడ్ గా తెలిసింది, విస్తరించింది. ఇక అతడి టేకింగ్ స్టైల్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉండటంతో.. భవిష్యత్ లో హాలీవుడ్ సినిమాలు కూడా రాజమౌళి తెరకెక్కించే అవకాశాన్ని కొట్టిపారేయలేం.
ఈ క్రమంలోనే త్వరలో మహేష్ బాబుతో తెరకెక్కించే చిత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది అని ఇప్పటికే హింట్ ఇచ్చాడు జక్కన్న. దాంతో తన నెక్ట్స్ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తూ.. కలెక్షన్ల సునామీ సృష్టించాలి అన్నది జక్కన్న మాస్టర్ ప్లాన్. తద్వారా ఎలాగో సినిమాకి రెమ్యూనరేషన్ బదులుగా షేర్ తీసుకునే రాజమౌళి.. ప్రస్తుతం తాను ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసిన డబ్బు కంటే ఎక్కువే సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పనిలోనే పడ్డాడు మన జక్కన్న. అందుకోసం మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. దాంతో రాజమౌళి మాస్టర్ ప్లాన్ తెలిసిన చాలా మంది జక్కన్నలో ఓ విజయవంతమైన బిజినెస్ మెన్ కూడా ఉన్నాడు, మనమే కనిపెట్టలేకపోయాం అంటూ.. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మరి జక్కన్న ముందు చూపుపై, ఆయనలో దాగున్న బిజినెస్ మెన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.