తెలుగు చిత్ర పరిశ్రమలో నవంబర్ 15 ఓ చీకటి రోజుగా మిగిలిపోయింది. ఓ ధృవతార భువి నుంచి దివికేగి పోయింది. అసమాన్య సాహసాలే ఆయన ఇంటి పేరుగా.. అలుపెరగని శ్రమే ఆయన ఒంటి పేరుగా, చిత్ర పరిశ్రమలో ఘనమైన కీర్తి గడించిన ఓ మహోన్నత శిఖరం మంగళవారం కన్నుమూసింది. సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు చిత్రపరిశ్రమలో ఆయనో కౌబాయ్.. ఓ అల్లూరి.. ఓ గూఢాచారి. సినిమాలు తీయడానికే ఆపసోపాలు పడుతున్న కాలంలో కొత్త టెక్నాలజీతో.. తెలుగు సినీ ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన ఘనుడు ఈ నటశేఖరుడు. గుండెపోటుతో 80 సంవత్సరాల వయసులో మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. దాంతో యావత్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మరికొందరు తమ కృష్ణ మృతికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే దర్శక దిగ్గజం రాజమౌళి చేసిన ఎమోషన్ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దిగ్బ్రాంతి చెందింది. ఇక కృష్ణ పార్థివ దేహాన్ని చూడ్డానికి వచ్చిన ప్రముఖులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రముఖు హీరో మోహన్ బాబు సోదరా సోదరా అంటూ ఏడ్చిన వీడియో అందరిని కలచి వేసింది. సూపర్ స్టార్ కృష్ణ మరణానికి సంతాపం తెలుపుతు డైరెక్టర్ రాజమౌళి ఎమోషనల్ ట్వీట్ చేశాడు. “సూపర్ స్టార్ ఆకస్మిక మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. కృష్ణ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. 300లకు పైగా చిత్రాల్లో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు సూపర్ స్టార్ ఎనలేని సేవచేశారని” రాజమౌళి పేర్కొన్నారు.
అదికాక ఇండస్ట్రీలోకి కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కే దక్కుతుందని ప్రశంసించారు. సినిమాలపై ఆయనకు ఉన్న ప్రేమ, అభిరుచి ప్రత్యేకంగా నిలుస్తాయని రాజమౌళి కొనియాడారు. టాలీవుడ్ లో విప్లవాత్మకమైన మార్పులు 70 MM చిత్రం, తొలి కలర్ మూవీ లాంటి ఎన్నో ఘనతలను ఆయన సాధించారు. డేరింగ్ అండ్ డాషింగ్ కు మారుపేరుగా సూపర్ స్టార్ కృష్ణ నిలిచారని రాజమౌళి అన్నాడు. మహేశ్ బాబు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. త్వరలోనే మహేశ్ బాబుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇందుకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ ను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చూసుకుంటున్నారు.
Extremely saddened to hear about the sudden demise of Superstar Krishna Garu.
Krishna garu’s contribution to the telugu film field as an actor in 300+ films, director, and producer are well known.
What sets him apart from the rest is his love and passion for newer technologies.— rajamouli ss (@ssrajamouli) November 15, 2022