గురువారం యూట్యూబ్‌లో విడుదలైన ‘పుష్ప 2’ టీజర్ అద్భుతాలను క్రియేట్ చేస్తోంది. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ను సంపాదించింది. ఈ నేపథ్యంలోనే సినిమా కథపై ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’.. అన్నట్లుగా పుష్పరాజ్ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాడు. శుక్రవారం విడుదలైన పుష్ప 2 సినిమా టీజర్ వీడియో యూట్యూబ్‌లో సంచలనాలను నమోదు చేస్తోంది. సౌత్ సంగతి పక్కన పెడితే.. హిందీ రీజన్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ టీజర్ విడుదలైన 18 గంటల్లోనే 21 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీన్ని బట్టే తెలిసిపోతుంది.. పుష్ప 2కు ఉన్న క్రేజ్ ఏంటో. పుష్ప 2 సినిమా మొదటి భాగం కంటే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
ఇప్పుడు ఇండియా మొత్తం పుష్ప 2 క్రియేట్ చేయబోయే రికార్డుల గురించే మాట్లాడుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 కథకు సంబంధించిన ఓ ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇంతకీ ఆ చర్చ ఏంటి? నెటిజన్లు దాని గురించి ఏం చర్చించుకుంటున్నారంటే.. 3 నిమిషాల నిడివి ఉన్న పుష్ప సినిమా టీజర్‌లో కేవలం గొడవలు, పుష్ప మాస్ ఎంట్రీని మాత్రమే చూపించారు. దాన్ని బట్టి చూస్తే పుష్పరాజ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తిరిగి వస్తాడన్న సంగతి అర్థం అయిపోతుంది.
ఈ మూడు నిమిషాల్లో సినిమాలో ప్రధాన పాత్ర అయిన హీరోయిన్ ప్రస్తావన ఎక్కడా రాలేదు. దీన్ని బేస్ చేసుకుని రాబోయే సినిమాలో శ్రీవల్లి చనిపోబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇక, శ్రీవల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటం చుట్టే సెకండ్ హాఫ్ నడవబోతోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. సినిమాలో పుష్ప శుత్రువులైన ఎస్పీ షకావత్.. జాలి రెడ్డి.. మంగళం శీనులు పుష్పరాజ్‌ను చంపేంత సీను ఉండదు. ఈ నేపథ్యంలోనే అతడిపై కక్ష తీర్చుకోవటాని అతడి భార్య అయిన శ్రీవల్లిని చంపేస్తారన్న వాదనను నెటిజన్లు బలంగా వినిపిస్తున్నారు.
అంతేకాదు.. పుష్పరాజ్ మిత్రుడైన కేశవను కూడా చంపేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వైరల్‌గా మారిన పుష్పరాజ్ గంగమ్మ అవతారం కూడా శ్రీవల్లి కోసమే అని అంటున్నారు. శ్రీవల్లి మీద ప్రేమతో అర్థనాధీశ్వరుడి రూపంలో విలన్లతో ఫైట్ చేసే మాస్ సీన్ కోసం ఆ అవతారం ఎత్తుతాడని చెబుతున్నారు. ఇక, సోషల్ మీడియలో జోరుగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం ఎంతుందో తెలియాలంటే.. సినిమా తెర మీదకు రావాల్సిందే. అంతవరకు కథపై జరిగే చర్చలు మొత్తం కేవలం పుకార్లుగానే మిగిలిపోతాయి. మరి, పుష్ప 2 టీజర్‌లో శ్రీవల్లితో పాటు కేశవలు కనిపించకపోవటానికి కారణం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.