నటి కరాటే కళ్యాణి – యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిల వివాదం గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి సంబంధించిన ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో, డిబేట్ లలో పాల్గొన్నారు శ్రీకాంత్ రెడ్డి, కరాటే కళ్యాణి. అలాగే శ్రీకాంత్ రెడ్డిపై దాడికి పాల్పడిన కరాటే కళ్యాణి.. ఆ దాడిలో శ్రీకాంత్ రెడ్డి ఆమెపై కూడా చేయి చేసుకున్నాడు. ఆ మరుసటి రోజే ఇద్దరూ ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో తెలిపారు.
ఇక ఈ వివాదానికి సంబంధించి ఇంకా పరిష్కారం రానట్లే తెలుస్తుంది. ఈ క్రమంలో పలువురు కరాటే కళ్యాణికి సపోర్ట్ చేస్తుండగా.. మరోవైపు పలువురు యూట్యూబర్లు శ్రీకాంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ చేస్తున్నారు. అయితే.. గత రాత్రి చిల్డ్రన్ వెల్ఫేర్ అధికారులు కరాటే కళ్యాణి ఇంట్లో సోదాలు జరిపారు. ఆ తరువాత నుండి కరాటే కళ్యాణి కనిపించడం లేదంటూ వార్తలు బయటికి వచ్చాయి. 24 గంటలు దాటినా తన కూతురు ఇంటికి తిరిగిరాలేదని కరాటే కళ్యాణి తల్లి కూడా వార్తల్లో నిలిచారు.
ఈ నేపథ్యంలో కాంట్రవర్సీ నటి శ్రీరెడ్డి.. శ్రీకాంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఈ వివాదం పై స్పందించింది. అలాగే ఈ వివాదంపై స్పందిస్తూ ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో శ్రీరెడ్డి శ్రీకాంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ.. కరాటే కళ్యాణిని ఏకిపారేసింది. మధ్యమధ్యలో బూతులు వాడుతూ కరాటే కళ్యాణిపై నిప్పులు చెరిగింది. ప్రస్తుతం శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మరి శ్రీరెడ్డి వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.