తెర ముందు నవ్వుతూ ఆడే ప్రతీ బొమ్మ కదలిక వెనుక ఒక వ్యధ ఉంటుంది. తెర వెనుక జరిగే కథలు మనకెవరికీ తెలియవు. కానీ సినిమా వాళ్ళూ మనుషులే, వాళ్ళవి సున్నితమైన మనసులే. ఆ మనసుకి గాయమైతే తట్టుకోలేరు. ఆర్టిస్టుల మనసు గాయమైతే అభిమానులతో పంచుకోకుండా ఉండలేరు. తాజాగా శ్రీను వైట్ల తన మనసులో ఉన్న బరువైన బాధను అభిమానులతో పంచుకున్నారు. నీకోసం సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన శ్రీను వైట్ల.. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్ శీను, ఢీ, రెడీ, కింగ్, దూకుడు, బాద్ షా వంటి హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా కొనసాగారు. జీవితం అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలానే శ్రీను వైట్ల జీవితంలో కూడా వరుస ప్లాపులు పలకరించాయి. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి.
ఇందులో భాగంగానే ఇటీవలే ఆయన భార్య రూప.. శ్రీను వైట్లతో విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు. ఈ వార్త సోషల్ మీడియా అంతటా బాగా వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా శ్రీను వైట్ల తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. “జీవితం చాలా అందమైంది. కానీ నచ్చిన వాళ్ళతో ఉంటే ఆ జీవితం మరింత అందంగా ఉంటుంది. ఈ ముగ్గురూ (కూతుర్లు) లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరేం బాధపడకండి సార్. మీరు కోల్పోయినవి మీకు దక్కుతాయి అంటూ అభిమానులు భరోసా ఇస్తున్నారు. కాగా శ్రీను వైట్ల ప్రస్తుతం ఢీ సీక్వెల్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. నీకోసం సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన శ్రీను వైట్ల.. మన కోసం ఎన్నో నవ్వులు పూయించే సినిమాలని అందించారు. కానీ ఆయన జీవితంలో మాత్రం నవ్వులు మిస్ అయ్యాయి. తాను జీవితంలో కోల్పోతున్న సంఘటనను ట్విట్టర్ లో షేర్ చేసి అందరినీ కంటతడి పెట్టించిన ఆయన కళ్ళు తుడిచేందుకు భార్య, పిల్లలు ప్రయత్నించాలని కోరుకుందాం. మరి ఈ ఎమోషనల్ ట్వీట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Life is beautiful but with your loved ones it’s more than beautiful. Can’t imagine life without my three musketeers!! pic.twitter.com/kqbNAu79CU
— Sreenu Vaitla (@SreenuVaitla) July 21, 2022
ఇది కూడా చదవండి: Chiranjeevi: చిరంజీవిపై విషప్రయోగం చేయించింది ఎవరు? ఇప్పటికీ వీడని మిస్టరీ?
ఇది కూడా చదవండి: Dhanush: సౌత్, నార్త్, అన్న తేడాలు లేవు! హీరో ధనుష్ కామెంట్స్ వైరల్!